తెలుగుదేశం గుండెల్లో
మోగుతోంది ‘గంటా’రావం
గండం దాటే దారి తెలీక
వారిది మూగ ఆర్తనాదం!
‘గడనుడిగిన మగని’ తీరు
మాజీగా బాబు వైభోగం
జావగారిపోకుండా ఇంకా
రంకెలేస్తుండడం ఒక యోగం!!
గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో తెలుగుదేశాన్ని వీడిపోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న ఎమ్మెల్యేలు
దారుణమైన ఓటమితో తెలుగుదేశం బేజారెత్తిపోయిన వైనాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని భారతీయ జనతా పార్టీ చూస్తోంది. ఆ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలు కూడా కమలదళం లోకి ఫిరాయించే మార్గంలో ఉన్నారు. ఫిరాయింపుల నెపంపై అనర్హత వేటు పడకుండా.. ఏకంగా మూడింట రెండొంతుల మంది మారిపోతే.. ఏకంగా విలీనమే చేేసేయవచ్చుననే ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే.. చంద్రబాబునాయుడుకు కనీసం ప్రతిపక్షహోదా కూడా ఉండదన్నమాట.
Discussion about this post