తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం కార్యనిర్వాహక కార్యదర్శిగా శ్రీకాళహస్తికి చెందిన నెమళ్లూరు సుబ్రహ్మణ్యం (బుజ్జి)ని నియమించారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు శుక్రవారం నియాయక ఉత్తర్వులు పంపారు. ఈ సందర్భంగా నెమళ్లూరు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ… శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ ఛార్జి బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి ఆశీస్సులతో తనకు ఈ పదవి లభించిందన్నారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు. టీడీపీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. కాగా నెమళ్లూరు సుబ్రహ్మణ్యం గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ బీసీ సెల్ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. నెమళ్లూరు సుబ్రహ్మణ్యం నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

.