• About Us
  • Contact Us
  • Our Team
Friday, August 14, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

లోపలి మాట : ఏది సేవ..? ఏది సంస్కరణ..?

'సేవ' అనే పదం కంటే మోసమైన పదం మరొకటి ఈ ప్రపంచంలో లేదనేది సుస్పష్టం.

admin by admin
April 4, 2021
0
లోపలి మాట : ఏది సేవ..? ఏది సంస్కరణ..?

ఈ మధ్య నేను ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైనాను. అక్కడొక వ్యక్తి పరిచయమయ్యాడు.

మాటల సందర్భంలో… “మీరు ఏంచేస్తుంటారు?” అని అడిగాడు.

“హైస్కూలు ఉపాధ్యాయుణ్ణి” అని చెప్పాను.

తర్వాత సర్వసాధారణంగా అందరూ అడిగే ప్రశ్ననే నేనూ అడిగాను.. “మీరు ఏంచేస్తుంటా”రని

deviprasad obbu columnist“నేను ఒక సేవాసంస్థను నడుపుతుంటానండీ” అని ఆ వాక్యానికి ఫుల్ స్టాప్ పెట్టకుండా మళ్ళీ ఆయనే కొనసాగించాడు.. “మా సంస్థ ద్వారా రోజుకి వందమందికి అన్నదానం చేస్తామండి. అంతేకాకుండా  అప్పుడప్పుడు మెడికల్ క్యాంపులు నిర్వహించి నిరుపేదలకు మందులు ఉచితంగా ఇస్తామండి. గవర్నమెంటు పాఠశాలలో చదివే పిల్లలకు సంవత్సరానికి ఒకసారి పెన్నులు, నోట్ బుక్స్, రైటింగ్ ప్యాడ్స్ ఉచితంగా అందిస్తామండి…” అని ఆగకుండా చెప్పుకుంటూ పోతుండగా.. ‘వీటికంతటికీ డబ్బులు ఎక్కడ్నుంచి తెస్తారు’ అని నేను మనస్సులో అనుకుంటుండగా.. దానికి సమాధానంగా అన్నట్లు ఆయనే క్లారిటీ ఇచ్చాడు.. “మొదట్లో వీటికంతటికీ నేనే ఖర్చు పెట్టానండి. తర్వాత నేను చేసే కార్యక్రమాలు చూసి, దాతలు విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు. అప్పటి నుంచి నేను వెనుతిరిగి చూడలేదండి” అని చెప్పిన తర్వాత కాసేపు ఆలోచించి.. మళ్ళీ కొనసాగించాడు.. “కొంతమంది దేవుడి హుండీలో డబ్బులు వేస్తారు. మరికొంతమంది వరద బాధితుల్ని, అనాధల్ని ఆదుకొంటారు. ఇంకొందరు తమ ప్రవచనాలతో ప్రజల్ని చైతన్య పరుస్తుంటారు. అలా నాకు తోచిన సేవ నేను చేస్తూ ఈ సమాజాన్ని సంస్కరించాలనుకుంటున్నానండి” అని ఆయన ముగించిన తర్వాత ఎందుకో అక్కడ ఎక్కువసేపు ఉండాలనిపించలేదు.

అందుకని.. “రూంలో నా స్నేహితుడు ఎదురుచూస్తుంటాడ”ని చెప్పి మాకు కేటాయించిన రూం దగ్గరకు వచ్చేశాను. రూంలో నా స్నేహితుడు బెడ్ పై పడుకుని ఫోన్ చూసుకుంటున్నాడు. నేనూ నా బెడ్ పై నడుము వాల్చి.. పైన తిరుగుతున్న ఫ్యాన్ వైపు చూసి ఆలోచిస్తుండగా.. ‘సేవ, సంస్కరణ’ అనే పదాలు నా మనస్సును కలవరపెడుతున్నాయి. అసలు ‘సేవ, సంస్కరణలు అనేవి నిజంగా ఉన్నాయా? వీళ్ళు చేసేది అసలైన సేవేనా? అనే ప్రశ్నలు నా మనస్సులో చాలాసేపు సుడులు తిరిగిన తర్వాత.. ఆ ప్రశ్నలకు నాకు సమాధానం దొరికింది.

ఏదోక కోరికతో భక్తుడు దేవుడి హుండిలో డబ్బులు వేస్తాడు. పేరుకోసం కొంతమంది దానధర్మాలు, సేవాకార్యక్రమాలు చేస్తారు. మరికొందరు తమ ఆత్మసంతృప్తి, కాలక్షేపం కోసం ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్తుంటారు. అంటే.. ఎవరికివారు తమ స్వార్థ ప్రయోజనాలతో.. సమాజంలో ‘సేవ’ అనే అందమైన ముసుగులో తమ కార్యక్రమాలను యథేచ్ఛగా నిర్వహించుకుంటూ వెళ్తున్నారు.

దీనినిబట్టి అర్థమయింది ఏంటంటే.. ‘సేవ’ అనే పదం కంటే మోసమైన పదం మరొకటి ఈ ప్రపంచంలో లేదనేది సుస్పష్టం.

అంటే.. వీళ్ళు చేసేదంతా మోసమా? వీళ్ళందరూ స్వార్థపరులేనా? లోకంలో స్వార్థం లేకుండా ఎవరున్నారండి? అనే ప్రశ్నలు మీరు నా పై సంధించవచ్చు.

దానికి నా సమాధానం ఏటంటే.. వీళ్ళందరూ స్వార్థపరులే అని ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే వీళ్ళందరూ ఏదోక ఫలాపేక్షను ఆశించి చేస్తున్నారు. కాబట్టి అది సేవకాదు. వీరేకాదు నేను కూడా స్వార్థపరుణ్ణే. ఎందుకంటే విద్యార్థులకు బోధించిన దానికి ప్రతిఫలంగా జీతం తీసుకుంటున్నాను కాబట్టి. స్వార్థం తప్పు అని నేను అనడంలేదు. మనిషికి స్వార్థం లేకపోతే ఈ ప్రపంచంలో మనుగడేలేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే.. లోకంలో ఉన్న మనమంతా స్వార్థపరులమేగాని సేవాతత్పరులంకామనేది అక్షర సత్యం.

మరి సేవ అంటే.. ఏమిటి?

ఎటువంటీ.. ఫలాపేక్ష ఆశించకుండా ఇతరులకు సహాయపడటమే సేవ.

ఉదాహరణకు:

సూర్యుడు ప్రపంచానికి వెలుగునివ్వడం. మానవాళికి పంచభూతాలు (గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం) ఉపయోగపడడం.

*   *   *

ఇక సంస్కరణ విషయానికొస్తే…

సంస్కరణ అంటే.. బాగుచేయడం లేక ఉద్దరించడం.

ఈ మధ్యకాలంలో  ఏ కార్యక్రమానికెళ్ళినా కాస్త వయస్సు పైబడిన వారి నోట నుంచి ఓ మాట తరచూ వినిపిస్తోంది.. అదేంటంటే.. “ఏంటోనండి సమాజంలో నీతి, నియమాలు, భయం, భక్తి బొత్తిగా లేవండి.. ఎక్కడ చూసినా మోసం, కుట్ర, కుతంత్రాలు ఎక్కువైపోయాయి. దీనికంతటికీ సెల్ ఫోను, టి.వి. సీరియల్సే కారణమండి. ఈ సమాజాన్ని ఎవరు బాగుపరుస్తారో ఏమో! కానీ ఎవరోకరు మళ్ళీ ఖచ్చితంగా పుడతారండి ఈ కుళ్ళిపోయిన సమాజాన్ని ఉద్దరించడానికి” అని. ఈ మాట నిజమే అయినప్పటికీ ఒకరు ఇంకొకరిని ఉద్దరించడం అనేది సంభవమేనా? అని అనుమానం. ఎందుకంటే ఇంతవరకు ఎవరూ సమాజాన్ని ప్రత్యేకించి ఉద్దరించిన దాఖలాలు నాకయితే కనబడలేదు.

ఉదాహరణకు:

పశువులు ఒక రాతి స్తంభానికి వొళ్లు రుద్దుకుంటూ ఉంటాయి వొంటిదురద తీరడానికి. కొంతకాలానికి ఆ స్తంభం బాగా నునుపు తేలిపోతుంది. కాని ఆ పశువుల ఉద్దేశం ఆ రాతిని నునుపు చేయాలని కాదు కదా!

అట్లే, సంఘాన్ని సంస్కరించాలని బయలుదేరిన వారంతా సంఘం కొరకు కాదు. తమ కొరకే. బహుశా అతని వల్ల సంఘం సంస్కరింపబడినట్లు అనిపించవచ్చు. కాని అది స్వయంగా తనను తాను సంస్కరించుకోవడంలో భాగమే.

అందుకే కాబోలు.. ఆనాడు రామతీర్థులు ఒకసారి పత్రికలో ఒక ఆసక్తికరమైన ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన ఏంటంటే.. ‘సంస్కర్తలు కావలెను’ అని పెట్టి కింద ముఖ్య గమనిక ‘తమ్ము తాము సంస్కరించుకుని ఉండవలయును’ అని ప్రకటన ఇచ్చారు. దాని అర్థం ఏంటంటే.. ఎవరికి వారు మొదట తమను తాము సంస్కరించుకుంటే.. ఇంక సంస్కరించడానికి ఎవరూ కనబడరు.

ఉదాహరణకు:

అద్దాన్ని చూసి తల దువ్వుకుంటాంగాని ప్రతిబింబానికి తలదువ్వడానికి ప్రయత్నించం కదా! తాను తలదువ్వుకుంటే ప్రతిబింబము కూడా సరి అయిపోతుంది. అలాగే వ్యక్తి సంస్కరణే సంఘసంస్కరణ.

మరొక ఉదాహరణ:

ఒక రైతు లాభం వచ్చినా, నష్టం వచ్చినా వ్యవసాయం చేయడం మానడు. కుటుంబ యజమాని తనకు ఎన్ని బాధలున్నా భార్యా, పిల్లల బాగోగులను చూసుకోకుండా ఉండలేడు.  తమ పిల్లలు ఎన్ని తప్పులు చేసినా వాటిని సరిదిద్ది క్షమించేస్తుంది తల్లి. అలాగే కులవృత్తుల వారు (చేనేత, కుమ్మరి, వడ్రంగి, గీత కార్మికులు.. మొదలగువారు) తమ వృత్తిలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా, నష్టాలు వచ్చినా వాటన్నింటినీ భరిస్తూనే తమ వృత్తినే దైవంగా భావిస్తూ వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహిస్తున్నారు. కాబట్టి వీళ్ళే అసలైన సంఘసంస్కర్తలు.

కాబట్టి ఏది సంస్కరణ… అంటే..

ఎవరి బాధ్యతను, కర్తవ్యాన్ని వాళ్ళు సక్రమంగా నిర్వహించడమే సంస్కరణ. ప్రత్యేకించి సమాజాన్ని బాగుచేయాలనిగాని, ఉద్దరించాలనిగాని చేసే ప్రయత్నాలన్ని వృథా ప్రయాసలే. కాబట్టి ఎవరైతే తమకు నిర్దేశించిన బాధ్యతను, కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తారో వాళ్ళందరూ సంఘసంస్కర్తలే.

…దేవీప్రసాద్ ఒబ్బు
9866251159.

Tags: deviprasad obbulopalimataobbu deviprasadreformsocial servicespiritual teachingwhat is service? what is reform? service
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

12.7.26 ‘కథానిధి’ సమీక్ష: సమకాలీన జీవిత వైరుధ్యాలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply