• About Us
  • Contact Us
  • Our Team
Monday, July 27, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

లోపలిమాట : ఆత్మ సౌందర్యారాధనే అసలైన శృంగారం

జీవితానికి కూడు, గూడు, గుడ్డ ఎంత అత్యవసరమో శృంగారం కూడా అంతే అవసరం. కానీ, మనం 'శృంగారం' అనే పదాన్ని పలికినా, వినినా తెగ సిగ్గుపడిపోతుంటాం. అదేదో అంటరాని పదంలా.

admin by admin
September 15, 2021
0
లోపలిమాట : ఆత్మ సౌందర్యారాధనే అసలైన శృంగారం

జీవితానికి లక్ష్యం అంటూ ఏదైనా ఉందంటే అది జీవించడమే. అందుకే జీవితమంటే నాకు అపరితమైన ప్రేమ. జీవితంలో అన్నింటినీ ప్రేమిస్తూ, ఆనందంగా అనుభవిస్తూ జీవించాలి.

శరీరం నుంచి ఆత్మ వరకు…
భౌతికం నుంచి ఆధ్యాత్మికం వరకు…
సంభోగం నుంచి సమాధి వరకు…
ఇలా నా దృష్టిలో ప్రతిదీ పవిత్రమైనదే.

అందుకే…

ప్రతి క్షణాన్ని పూర్ణంగా, సంపూర్ణంగా ఆస్వాదిస్తూ జీవించడమే జీవిత పరమావధి.

జీవితానికి కూడు, గూడు, గుడ్డ ఎంత అత్యవసరమో శృంగారం కూడా అంతే అవసరం. కానీ, మనం ‘శృంగారం’ అనే పదాన్ని పలికినా, వినినా తెగ సిగ్గుపడిపోతుంటాం. అదేదో అంటరాని పదంలా.

నా దృష్టిలో శృంగారం కూడా పవిత్రమే. మరి అలాంటి పవిత్రమైన కార్యం పడకమీద పరవశాన్ని ఇవ్వాల్సిందిపోయి అవసానదిశలో అల్లాడుతున్న రోగిలా అవపోశాలు పడుతోంది నేటి ఆధునికయుగంలో.

deviprasad obbu columnistఎందుకంటే…

నాగరికత పరంగా శాస్త్ర, సాంకేతిక రంగాలలో మనం ఎంతో అభివృద్ధి సాధించాం. ఇది సంతోషంతో స్వాగతించాల్సిన విషయమే. కానీ, దానికి సమాంతరంగా, అంతర్లీనంగా ఎంతో నష్టాన్ని కూడా చవిచూస్తున్నాం.

ఎలాగంటే…

సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేసే యువతీ, యువకులు గంటలకొద్దీ కంప్యూటర్ డబ్బాల ముందు కూర్చోవడంవల్ల వాళ్ళకు తెలియకుండానే వాళ్ళల్లో ఒకవిధమైన నిర్లిప్తత, నిస్తేజం అనేవి ఆవహింపబడుతున్నాయి. అది వాళ్ళ దాంపత్య జీవితంపై ఎక్కువ ప్రభావితం చూపుతోంది.

ఆ కారణంచేతనే ఆ రంగంలో పనిచేసే భార్యాభర్తలలో విడాకుల శాతం ఎక్కువగా ఉన్నాయని కొన్ని సర్వేలు చెప్తున్నాయి.

అలాగే…

మితిమీరిన సెల్ ఫోన్న వినియోగం, హింసను, అశ్లీలతను ప్రేరేపించే కొన్ని సినిమాలు, సీరియల్స్ కూడా మనిషి మనస్తత్వాన్ని కలుషితం చేస్తున్నాయి. ఆ విషపూరిత భావజాలాలు మనిషి అంతరాలలో చొరబడడంవల్ల  అటు సమాజంలోనూ, ఇటు కుటుంబాలలోనూ అవాంఛనీయ, అమానవీయ సంఘటనలైన మానభంగాలు, హత్యలు, అక్రమ సంబంధాలు చోటుకుంటున్నాయి. తద్వారా వచ్చే కలహాలు కుటుంబాలను, సమాజాన్ని కలవరపెడుతున్నాయి. ఆ ప్రభావం ప్రధానంగా దాంపత్య జీవితంపై పడుతోంది. ఆ కారణంచేతనే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతుంటే, ఎంతోమంది పసిపిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు.

మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే మనం ఏంచెయ్యాలి…? అనే విషయాలు తెలుసుకునే ముందు అసలు ‘శృంగారం’ అంటే ఏమిటి? అది నిజంగా మనం అనుభూతితో అనుభవిస్తున్నామా? లేదా? అనే విషయాలు తెలుసుకుందాం.

శృంగారం అంటే..

స్త్రీ, పురుషుల శారీరక కలయికనే కాదు, వాళ్ళ మధ్య ఉండే ఆప్యాయత, అనురాగం, నమ్మకం, గౌరవం, ఇష్టం, ఆశలు, ఆకాంక్షలు కూడా శృంగారమే.

శృంగారం అంటే… సింగారం.

సింగారం అంటే అలంకరణ. అలంకరణ అంటే పైకి కనిపించే మెరుగులు కాదు. లోపల ఉండే ఆత్మ సౌందర్యం. ఏ స్త్రీకైనా, పురుషుడికైనా ఆత్మ సౌందర్యమే అసలైన ఆభరణం.అదే అసలైన శృంగార సౌందర్యం.

ఎలాగంటే…

ఉద్యోగానికో, వ్యాపారానికో బయటకు వెళ్ళిన భర్త కోసం భార్య గుమ్మం దగ్గర చేరి వీధివైపు ఆత్రుతతో ఎదురుచూడటంతోపాటు రాగానే ప్రేమతో పలకరించి, నీళ్ళనో, కాఫీనో, టీనో ఇవ్వడం.. భర్తకు భోజనం వడ్డించేటప్పుడు ప్రేమతో కొసరి, కొసరి వడ్డించడంతో పాటు కబుర్లు చెప్తూ కలిసిమెలసి భోంచేయడం.. తమయొక్క ఇష్టాలను, భావాలను, ఆశలను, ఆకాంక్షలను పరస్పరం ఇద్దరూ గౌరవించుకుని, ఎలాంటీ దాపరికాలు లేకుండా భార్యాభర్తలు నమ్మకంతో బతకడం..

స్త్రీ ఔనత్యాన్ని తెలిపే నుదిటిపై తిలకధారణ…
నయనానందకరం కలిగించే కాటుక కన్నులు…
మనసును గుబాళింపజేసే సిగలో మల్లెపూలు…
గుండెను పరవశింపజేసే కాళ్ళ గజ్జెల సవ్వడి…
స్త్రీ సౌందర్యాన్ని సాక్షాత్కరించే అందమైన చీరకట్టు…

ఇవన్నీ కూడా శృంగార సౌందర్యానికి ప్రతిరూపాలే.

మన ముందు తరాలవారు అలాంటి వాతావరణంలో జీవించారు కాబట్టే వాళ్ళ మధ్య బంధాలు బలంగా ఉండడంతోపాటు దాంపత్య జీవితం అన్యోన్యంగా, శోభాయమానంగా అలరారింది. మరి అలాంటి వాతావరణం మన ఇండ్లల్లో ఉందా? లేదా? అనేది ఎవరికివారు ఆలోచించుకోవాల్సిన విషయం.

“ఉద్యోగానికి వెళ్ళొచ్చిన తర్వాత కూడా మాకు ఎన్నో పనులు ఉంటాయి. మళ్ళీ భార్యాబిడ్డలతో గడపటానికి టైం ఎక్కడుందండి మాకు?” అని మగవారు.

“ఉద్యోగం చేసి, బస్సుల్లో, ఆటోల్లో అవస్థలు పడి ఇంటికి చేరేసరికి దేవుడు కనిపిస్తున్నాడు. ఇంటికొచ్చాక వంటచేయడంతోపాటు మిగతాపనులు చేసేసరికే మా పనైపోతుంది. మళ్ళీ వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవడానికి మాకు సమయం ఎక్కడుందండి?” అని ఉద్యోగం చేసే ఆడవాళ్ళు వాపోతుంటారు.

మరి ఇంటిపట్టున ఉన్న ఆడవాళ్ళు అలాంటి వాతావరణాన్ని కల్పించుకోవచ్చుకదా! అంటే “ఉద్యోగం చేసే వాళ్ళకంటే మాకే ఎక్కువ పనులుంటాయి” అని వాళ్ళు వాదిస్తుంటారు.

ఇలా ఎవరికివారు కుంటిసాకులు చెప్తూ, మునుపటిలా బతకడానికి ఇష్టంలేకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు నాకు కనిపిస్తున్నాయి.

1. సెల్ ఫోనుకు, టివీ సీరియల్స్ కు బానిసలు అయిపోవడం.

2. తను కోరుకునే సుఖం ఇంట్లోలేదని, మరెక్కడో అది దొరుకుతుందనే అజ్ఞానపు ఆలోచన.

ఈ రెండింటిని నుంచి బయటపడితేగాని నీవు కోరుకునే సుఖం లభించదు అనేది అక్షరసత్యం.

కనుక…

అవసరం మేరకు మాత్రమే సెల్ ఫోను వినియోగించాలని నిర్ణయానికొచ్చి తదనుగుణంగా నడచుకోవటంతోపాటు, ఇంట్లో దొరకని సుఖం మరెక్కడా దొరకదు అనే పరమసత్యాన్ని అందరూ గ్రహించగలిగినప్పుడే జీవితం సుఖమయం అవుతుంది.

నా చిన్నతనంలో.. అంటే నేను పదవతరగతి చదివే సమయంలో నేను గమనించిన కొన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తూన్నాను…

సాయంత్రం అవగానే.. ప్రతి స్త్రీ శుభ్రంగా స్నానంచేసి, నుదుటిపై చొక్కా బటన్ అంత బొట్టు పెట్టుకుని, సిగలో మల్లెపూలు ధరించి, కళ్ళకు నిండుగా కాటుక పెట్టుకుని, అందంగా చీరకట్టుకుని తన ఇంటి ముందున్న అరుగుమీద భర్త పక్కనే కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా గడిపేది. భార్యాభర్తలేకాదు చిన్నా, పెద్దా అందరూ అలా సరదాగా గడిపేవారు. అలాంటి అందమైన దృశ్యాలు ఇప్పుడు ఎంత వెతికినా ఎక్కడా కనబడడంలేదు.

కాబట్టి.. జీవితం అందమైనది. చాలా చిన్నది కూడా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో మృత్యువు ఎప్పుడు, ఎవరిని కబళిస్తుందో చెప్పలేం. అందుకనే అసూయ, ద్వేషం, అశాంతి, అపనమ్మకం, కుట్రలు, కుతంత్రాలు లాంటి అవలక్షణాలను విడనాడాలి.

భగవంతుడు ప్రసాదించిన అందమైన జీవితాన్ని సద్వినియోగం చేసుకుని, ప్రతి అందాలను, ఆనందాలను అనుక్షణం ఆస్వాదిస్తూ, ఆత్మ సౌందర్యాన్ని కలిగి, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పరమానందంగా వేడుక చేసుకోవడమే అసలైన శృంగారం.

.. దేవీప్రసాద్ ఒబ్బు

98662 51159.

Tags: couple lovedeviprasad obbudisturbed lovelopalimatalovemaking loveobbu deviprasadromancesexsringaramsrungaramwife and husband love
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5.7.26 ‘కథానిధి’ సమీక్ష: సామాజిక రుగ్మతలపై అక్షరాల తిరుగుబాటు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply