ప్రధాని నరేంద్రమోడీతో జనసేనాని పవన్ కల్యాణ్ జులై 4వ తేదీన భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆ రోజున అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఏపీలోని భీమవరం వస్తున్న ప్రధానిని, పవన్ కల్యాణ్ కలవనున్నారు. ఇందుకు ఆయన ఢిల్లీలో లాబీయింగ్ మొదలుపెట్టినట్టు సమాచారం.
ప్రధానిని ఏపీలోని కలిసి, ఏపీ రాజకీయాలను వివరించి.. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్న తన ఆలోచనను వివరిస్తారని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ గత ఎన్నికలకంటె బలంగా ఉన్నదని.. 2014 మాదిరిగానే మూడు పార్టీలు కలిసి పోటీచేస్తే ఖచ్చితంగా అధికారంలోకి రాగలం అనే ప్రతిపాదనను మోడీ ముందు పవన్ ఉంచుతారని తెలుస్తోంది.
Discussion about this post