దేశంలో చమురు ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వరుసగా ఆరో రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు కంపెనీలు పెంచాయి. ఈ దెబ్బతో మెట్రోనగరాల్లో చమురు ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తాజాగా లీటర్‌కు 20 నుంచి 34 పైసలకు పైగా పెట్రోల్,డీజిల్ ధరలు పెరిగాయి.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.88.78 కాగా డీజిల్ రూ.79.06 పలుకుతోంది.
ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.95.21, కాగా డీజిల్ రూ.86.04
చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.90.96, కాగా డీజిల్ రూ.84.16
బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ.91.76, కాగా డీజిల్ రూ.83.87
కోల్ కతాలో లీటర్ పెట్రోల్ రూ.90.01, కాగా డీజిల్ రూ.82.65
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.92.26, కాగా డీజిల్ రూ.86.23
నగరాలలో పరిస్థితి ఇలా ఉండగా.. మొత్తంగా కలిపి పరిశీలిస్తే.. ఫిబ్రవరి నెలలో 14వ తేదీ లోగానే.. ఎనిమిదిసార్లు పెట్రోల్,డీజిల్ ధరలు పెరిగడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతుండడంతో దేశీయంగా కూడా చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
ఈ నెలలో మొత్తంగా చూసినప్పుడు పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు దాదాపు రూ.5 వరకు ధర పెరిగింది. మరో కోణంలోంచి చూసినప్పుడు.. గత 11 నెలల కాలంలో ఒక్కసారి కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదు.