వైసీపీ ఎమ్మెల్యే మంత్రి పదవి కోసమే ఇదంతా చేస్తున్నాడనే ప్రచారం పుష్కలంగా వినిపిస్తోంది. అయితే.. ఆయన చేస్తున్న అల్లరికి వెనుక స్కెచ్, జరిగిన కుట్ర, అందులో పాత్రధారులు, సూత్రధారులు అందరూ నిగ్గు తేలాలంటే ఒక్క పనిచేస్తే సరిపోతుంది.
చంద్రబాబునాయుడు ఇంటిమీద దాడికి పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రయత్నించడం, తెలుగుదేశం నాయకులు అడ్డుకోవడంతో చెలరేగిన ఘర్షణలు ఈ అన్ని ఎపిసోడ్ లకు సంబంధించి.. నాలుగు కేసులు పోలీసులు నమోదు చేశారు. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదులతో కేసులు నమోదు అయ్యాయి.
ఈ ఎపిసోడ్ లో అధికార పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ ను తగాదా జరిగిన రోజున పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత ఆయన విడుదల అయ్యారు. మరురోజు మళ్లీ చంద్రబాబు ఇంటిమీదికి ఎగబడ్డారు.
మొత్తానికి కేసులు నమోదు అయ్యాయి. జోగి రమేష్ ప్రయాణించిన మార్గంలోను, టీడీపీ నాయకులు వచ్చిన మార్గాల్లోనూ సీసీ టీవీ ఫుటేజీలను కూడా ఆధారాల కోసం పోలీసులు సేకరిస్తున్నారు.
మరోవైపు తెలుగుదేశానికి చెందిన బుద్ధా వెంకన్నతో ఒక అండర్ స్టాండింగ్‌తోనే జోగి రమేష్.. ఈ దాడి వ్యవహారాన్ని డ్రామాలాగా నడిపించాడనే పుకారు ముమ్మరంగా వినిపిస్తోంది. వారిద్దరూ టీవీ కెమెరాల ఎదుట రెచ్చిపోయి మైలేజీ కోసం మీడియాలో తమ మిత్రులకు ఫోన్ చేసి పిలుచుకుని నాటకం ఆడారనే విమర్శలు బాగా ఉన్నాయి.
ఇలా చేస్తే కుట్ర ఏంటో తేలుతుంది..
జోగి రమేష్ పాత్రను తేల్చడానికి పోలీసులు నానా ప్రయత్నాలు చేస్తుండగా.. ఒక్క పనిచేస్తే చేస్తే చాలు.. ఈ దాడుల వెనుక కుట్ర ఉన్నదో లేదో? ఎలాంటి కుట్ర ఉన్నదో? ఆ కుట్రకు సూత్రధారులు, పాత్రధారులు ఎవ్వరెవ్వరో? విపులంగా అర్థమవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
దాడి జరిగిన రోజున జోగి రమేష్ కాల్ డేటాను పరిశీలిస్తే.. వ్యవహారం ఎలాంటి మలుపులు తిరిగిందో అర్థమైపోతుంది. అలాగే ఇప్పుడు ముందు జాగ్రత్త అన్నట్టుగా జోగి రమేష్ తన కారు డ్రైవరుతో తెలుగుదేశం నాయకులపై ఎస్సీ ఎట్రాసిటీ కేసు పెట్టించారు. ఈ కేసు అనగానే.. చూపరులకు ఆయన వాదనలో విషయంలేదని అర్థమైపోతుంది. డ్రైవరు పాత్ర కూడా బాగానే ఉన్నట్టు తేలుతోంది గనుక.. డ్రైవరు కాల్ డేటాను, జోగి రమేష్, ఆయన సహాయకుల కాల్ డేటాను పరిశీలిస్తే.. ఆరోజున వారు ఎవరెవరికి ఫోన్ చేశారో.. మీడియాను పిలిచి మైలేజీ కోసం డ్రామా ఆడారో లేదో తేలిపోతుంది. ఇప్పుడు తెలివిమీరిన రాజకీయ నాయకులు చాలా వరకు వాట్సప్ కాల్స్ చేస్తున్నారు గానీ.. కాల్ డేటా చూస్తే కుట్రకోణం తెలిసే అవకాశం ఉంది.
ప్రస్తుతం సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలిస్తున్న పోలీసులు.. కాల్ డేటా వివరాలు రాబడితే. ఎక్కువ ఫలితం ఉండొచ్చు. జోగి రమేష్ ఎపిసోడ్ లో కుట్ర నిగ్గు తేలవచ్చు.
.

Discussion about this post