అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరువేంకట గిరినాధుని ఆస్తులపై టీటీడీ ధర్మకర్తల మండలి శనివారం నాడు శ్వేతపత్రం విడుదల చేసింది. శనివారం ధర్మకర్తల మండలి భేటీ పూర్తయిన తర్వాత.. ఈ శ్వేతపత్రం విడుదల చేశారు. ఇందులో 1974 నుండి 2014 వరకు ఉన్న మొత్తం టీటీడీ ఆస్తుల వివరాలు వెల్లడించారు. ఆ వివరాలు ఇవే..
శ్రీవారి మొత్తం ఆస్తుల సంఖ్య 1128
మొత్తం ఎకరాల్లో 8088.89 సెంట్లు
వ్యవసాయ వస్తువులు సంఖ్య పరంగా.. 233
మొత్తం ఎకరాల్లో వీటి విస్తీర్ణం 2085 ఎకరాల 41 సెంట్లు
వ్యవసాయేతర ఆస్తులు 895
మొత్తం ఎకరాలు 6003.48 సెంట్లు
1974 నుండి 2014 వరకు విక్రయించిన
ఆస్తులు మొత్తం 141
ఎకరాల్లో వీటి విస్తీర్ణం 335.23 సెంట్లు
వ్యవసాయ ఆస్తులు మొత్తం 61
ఎకరాల్లో 293.02 సెంట్లు
వ్యవసాయేతర ఆస్తులు 80 ఎకరాల్లో 42 21 సెంట్లు
ఆస్తులు అమ్మగా వచ్చిన ఆదాయం 6 .13 కోట్లు
28/11/2020 నాటికి టీటీడీ వద్ద ఉన్న నికర ఆస్తుల సంఖ్య 987
మొత్తం ఎకరాల్లో 7753.66 సెంట్లు
వ్యవసాయ ఆస్తులు 172 ఎకరాల్లో 1792.39 సెంట్లు
వ్యవసాయేతర ఆస్తులు 815 మొత్తం ఎకరాలు 5961.27 సెంట్లు
ఈ వివరాలు వెల్లడించిన తర్వాత.. అన్యాక్రాంతమైన ఆస్తులను గుర్తించడానికి త్వరలోనే కమిటీని నియమిస్తాం అని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలియజేశారు.
ధర్మకర్తల మండలి భేటీ కీలక నిర్ణయం
టిటిడి ఉద్యోగులకు ఈహెచ్ఎస్ అమలు వాయిదా వేస్తున్నట్లుగా వేసిన టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలియజేశారు. ఈహెచ్ఎస్ విషయంలో టీటీడీ ఉద్యోగుల అనుమానాలను నివృత్తి చేసి ముందుకువెళతాం అని ప్రకటించారు.
.