అగ్రశ్రేణి సినీనటుడు మంచు మోహన్ బాబు సోదరుడు మంచు రంగస్వామినాయుడు (63) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చిత్తూరు జిల్లా తిరుపతిలో బుధవారం ఆయన గుండెపోటుతో మరణించారు.
రంగస్వామినాయుడు తిరుపతిలో ఉంటూ వ్యవసాయం చేస్తుంటారు. మోహన్ బాబు చేపట్టే సామాజిక కార్యక్రమాల బాధ్యతను ఎక్కువగా తనే చూస్తుంటారు. మోహన్ బాబుతో వ్యక్తిగత అనుబంధం ఉన్నవారికి ఆయన పరిచితులే.
రంగస్వామినాయుడు మరణంతో మంచు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. రంగస్వామినాయుడు అంత్యక్రియలు గురువారం తిరుపతి గోవిందధామంలో జరగనున్నాయి.
.