రీఎంట్రీతో బ్రహ్మి జోష్!

90

బ్రహ్మానందం వెండితెరమీద కనిపించి చాలాకాలం అయింది. అల వైకుంఠపురములో.. ఆ కొరత తీర్చింది. బ్రహ్మానందం కామెడీని ఇష్టపడే వారికి గ్యాప్ తర్వాత.. ఆ రిలీఫ్ దొరికింది. అనారోగ్యం వల్ల సుదీర్ఘకాలం షూటింగులకు దూరంగా ఉన్న బ్రహ్మానందం మళ్లీ మెరిపించారు. ఈ రీఎంట్రీ ఆయనకు చాలా జోష్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఆయన మునుపటిలాగానే… సెటైర్లువేస్తున్నారు. స్టేజీ మీద కూడా అదే తరహా కామెడీ చేస్తున్నారు. సినిమా థాంక్స్ మీట్ బ్రహ్మి తనమార్కు పంచ్ లు వేశారు.

“రాములో రాములా పాట క్లిక్కయ్యిందంటే కారణం బన్నీ అనుకుంటున్నారు. కాదు నేను…’’ అంటూ  ఆయన సైగలతో పాత స్టయిల్ ను తలపించారు. తను అనారోగ్యంతో ఉన్నప్పుడే పలకరించడానికి వచ్చిన బన్నీ, మరో సందర్భంలో త్రివిక్రమ్ నెక్ట్స్ సినిమా చాన్స్ గురించి చెప్పినప్పుడు నమ్మలేదని.. ఈ చిత్రంలో మంచి అవకాశం ఇచ్చారని మురిసిపోయాడు.  తమ సినిమా అయిపోయిన తర్వాత.. ఎలాగైనా బ్రహ్మానందంని చూపించాలనే ఉద్దేశంతోనే తనకు కారక్టెర్ యిచ్చారని చెప్పుకున్నాడు.

పనిలోపనిగా అల్లురామలింగయ్యతో ముడిపెట్టి… ఆయన మనుమడు అర్జున్ ను ఆకాశానికెత్తేశాడు. మాటనిలబెట్టుకోవడం గురించి మాట్లాడుతూ ‘‘బన్నీకి ఈ లక్షణం మా గురువుగారు అల్లు రామలింగయ్య గారి నుంచి వచ్చింది. అన్నేళ్లు ఆయన ఇండస్ట్రీలో ఎలాంటి వివాదం లేకుండా గడిపారు. నిబద్ధతతో ఉండే గొప్ప నటుడాయన. ఆయనను అద్భుతంగా ప్రేమించి, అభిమానించి, గౌరవించిన వ్యక్తి ఆయన కుమారుడు అరవింద్. అదే తరహాలో ఆయనను ప్రేమించే వ్యెక్తి బన్నీ. ‘మా నాన్న ఎక్కడ ఉంటాడో నేను అక్కడ ఉంటాను. ఇష్టమైతే నన్ను పెళ్లిచేసుకో, లేకపోతే లేదు’ కాబోయే భార్యకు ముందుగానే కండిషన్ పెట్టిన వాడు బన్నీ. అంటూ తెగ కీర్తించేశాడు.

మొత్తానికి బ్రహ్మానందంలో ఈ జోష్ మళ్లీ కొనసాగుతుందని.. తెరపై ఆయన మరిన్ని చిత్రాలు  చేస్తారని ఆశించవచ్చు.

Facebook Comments