లింగపరంగా డిజిటల్ అంతరాన్ని తొలగించేందుకు వినూత్న పరిష్కారాలను గుర్తించడంలో తోడ్పడేందుకు సంయుక్త కార్యక్రమం ప్రారంభించిన రిలయన్స్ ఫౌండేషన్, యూఎస్ ఎయిడ్
17 రాష్ట్రాల్లో పని చేయనున్న గ్రాంటీలు, 3 లక్షల మంది మహిళలు, బాలికలను చేరుకోనున్నారు
‘విమెన్ కనెక్ట్ చాలెంజ్’ ఇండియా కార్యక్రమానికి రిలయన్స్ ఫౌండేషన్ రూ.8.5 కోట్లు ($ 1.1 మిలియన్ డాలర్లకు పైగా మొత్తం) సమకూర్చనుంది.
‘విమెన్ కనెక్ట్ చాలెంజ్’ ఇండియా ద్వారా భారతదేశవ్యాప్తంగా మొత్తం పది సంస్థలను గ్రాంటీలు (మంజూరుకర్తలు) గా ఎంపిక చేశారు. రిలయన్స్ ఫౌండేషన్, యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ ఎయిడ్ (USAID) కలసి విమెన్ కనెక్ట్ చాలెంజ్ ఇండియాను ప్రారంభించాయి.
ఈ కార్యక్రమం ద్వారా రూ. 11 కోట్ల (1. 5 మిలియన్ డాలర్లకు పైబడిన మొత్తం)ను లింగ ఆధారిత డిజిటల్ వివక్షను తొ లగించేందుకు ఉపయోగించనున్నారు. ఇందులో రిలయన్స్ ఫౌండేషన్ రూ.8.5 కోట్ల మేరకు ($ 1.1 మిలియన్ డాలర్లకు పైగా మొత్తం) సమకూర్చనుంది. లింగ ఆధారిత డిజిటల్ వివక్షను తొలగించేందుకు వివిధ వినూత్న పరిష్కారాలను రూపొందించే ప్రాజెక్టుల కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు. 17 రాష్ట్రాల్లో 3 లక్షల మందికి పైగా మహిళలు, బాలికలు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఇది సాంకేతికత ద్వారా మహిళల ఆర్థిక సాధికారికతను అధికం చేయనుంది.
ఈ సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్ పర్సన్ నీతా ఎం అంబానీ మాట్లాడుతూ, ‘‘ప్రతీ జీవనశైలిలో మహిళలను సంసిద్దులను చేసి, వారికి సాధికారికత కల్పించడం మా లక్ష్యం. మేం జియో ను ప్రారంభించినప్పుడు, సమాన అవకాశాలు కల్పించే విప్లవం గురించి మేం కల కన్నాం. జియో ద్వారా మేం మన దేశవ్యాప్తంగా అందుబాటు ధరలకే అనుసంధానతను అందించగలగుతున్నాం. భారతదేశంలో లింగ ఆధారిత డిజిటల్ వివక్షను తొలగించేందుకు యూఎస్ ఎయిడ్ తో కలసి రిలయన్స్ ఫౌండేషన్ పని చేస్తోంది. అసమానతలను పరిష్కరించేందుకు, వాటిని తొలగించేందుకు సాంకేతికత అనేది ఒక శక్తివంత మైన ఆయుధం. విమెన్ కనెక్ట్ చాలెంజ్ ఇండియా విజేతలుగా నిలిచిన పది సంస్థలకు నా అభినంద నలు, ఈ పరివర్తన ప్రయాణంలో కలసి పని చేసేందుకు వాటిని ఆహ్వానిస్తున్నాం’’ అని అన్నారు.
అనుదీప్ ఫౌండేషన్, బేర్ ఫూట్ కాలేజ్ ఇంటర్నేషనల్, సెంటర్ ఫర్ యూత్ అండ్ అండ్ సోషల్ డెవలప్ మెంట్, ఫ్రెండ్స్ ఆఫ్ విమెన్స్ వరల్డ్ బ్యాంకింగ్, నాంది ఫౌండేషన్, ప్రొఫెషనల్ అసిస్టెన్స్ ఫర్ డెవలప్ మెంట్ యాక్షన్, సొసైటీ ఫర్ డెవలప్ మెంట్ ఆల్టర్నేటివ్స్, సాలిడారిడాడ్ రీజనల్ ఎక్స్ పర్టయిజ్ సెంటర్, టీఎన్ఎస్ ఇండియా ఫౌండేషన్, జెడ్ఎంక్యూ డెవలప్ మెంట్ ఈ సంస్థల్లో ఉన్నాయి. మహిళా రైతులు, ఆంత్రప్రె న్యూర్లు, స్వయం సహాయక బృందాల సభ్యుల సమస్యలను, సామాజిక, సాంస్కృతిక అడ్డంకులను అధిగ మించేందుకు, లింగ ఆధారిత డిజిటల్ అంతరాన్ని తొలగించేందుకు ఈ పరిష్కారాలు తోడ్పడుతాయి.
విమెన్ కనెక్ట్ చాలెంజ్ ఇండియా 2020 ఆగస్టులో ప్రారంభించబడింది. 180 కి పైగా వచ్చిన దరఖాస్తుల నుంచి 10 సంస్థలు ఎంపిక చేయబడ్డాయి. వీటికి ఒక్కో దానికి 12 నుంచి 15 నెలల కాలానికి రూ.75 ల క్షలు మొదలు రూ. కోటి ($100,000 – $135,000) దాకా గ్రాంటు గా లభించనుంది. 2021 జనవరిలో యూఎస్ ఎయిడ్, రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్తంగా సాల్వర్స్ సింపోజియంను నిర్వహించాయి. సెమీ-ఫైనలిస్టులను, సంబంధిత రంగాల నిపుణులను ఒకే వేదికపైకి చేర్చాయి. లింగ ఆధారిత డిజిటల్ వివక్షను తొలగించేందుకు మేధోమథనం నిర్వహించాయి.
ఏడాదికేడాది మహిళల్లో మొబైల్ ఇంటర్నెట్ అవగాహన అధికమవుతోంది. 2017లో భారతదేశంలో కేవలం 19% మందికి మాత్రమే మొబైల్ ఇంటర్నెట్ గురించి తెలుసు. 2020లో ఇది 53 శాతానికి పెరిగింది. యాజమాన్యపరంగా చూస్తే, 79% పురుషులకు గాను 67% మంది మహిళలు సొంతంగా మొబైల్ ఫోన్ ను కలిగిఉన్నారు. ఇన్నేళ్లుగా రిలయన్స్ ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు డిజిటల్ అంతరాన్ని తొలగించే లక్ష్యంతో కొనసాగాయి. రిలయన్స్ జియో ద్వారా 1.3 బిలియన్లకు పైగా భారతీయులు దేశవ్యాప్త డిజిటల్ విప్లవంలో భాగస్వాములయ్యారు, తమ జీవితాలను మార్చుకున్నారు. నేడు జియో 120 మిలియన్ల మ హిళా జియో వినియోగదారులతో, భారతదేశంలో అతిపెద్ద డిజిటల్ సేవల కంపెనీగా ఉంది. డిజిటల్ అంత రాన్ని తొలగించేలా ఈ సంఖ్య శరవేగంగా వృద్ధి చెందుతూనే ఉంది.
విమెన్ కనెక్ట్ చాలెంజ్ ఇండియా అనేది సాంకేతికతను మహిళలు యాక్సెస్ చేయడం, ఉపయోగించే విధానాలను అర్థవంతంగా మార్చడం ద్వారా రోజువారీ జీవితంలో మహిళలు పాల్గొనడాన్ని మెరుగుపరిచేందుకు అవసరమైన పరిష్కారాల కోసం ఓ పిలుపు లాంటిది. లింగ ఆధారిత డిజిటల్ వివక్షను తొలగించే నూత న విధానాల్లో భారతదేశంలో రిలయన్స్ ఫౌండేషన్ తో యూఎస్ ఎయిడ్ భాగస్వామిగా మారింది. ఈ నూత నంగా గ్రాంటు పొందిన సంస్థలు మహిళల ఆర్థిక సాధికారికతను అధికం చేసేందుకు గతంలో నిర్వహించిన విమెన్ కనెక్ట్ రౌండ్స్ నుంచి స్ఫూర్తి పొందిన నిరూపిత వ్యూహాల అమలుపై దృష్టి పెట్టనున్నాయి.
.

Discussion about this post