శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై టిటిడి సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, తిరుపతి ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. తిరుమల అన్నమయ్య భవనంలో బుధవారం ఈ సమీక్ష జరిగింది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల తొలిరోజైన సెప్టెంబరు 27న ధ్వజారోహణం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి పర్యటన కోసం బందోబస్తు, వాహనసేవలకు విచ్చేసే భక్తులకు పార్కింగ్ ఏర్పాట్లు, దొంగతనాలు జరుగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
అదేవిధంగా, క్యూలైన్లలో తోపులాట లేకుండా ఏర్పాట్లు, ఘాట్ రోడ్లలో కూంబింగ్, రాత్రి గస్తీ విధులు, అవసరమైన భద్రతా పరికరాలు తెప్పించుకోవడం, క్యూలైన్లు, బ్యారీకేడ్ల ఏర్పాటు, వసతి సముదాయాల వద్ద పోగయిన వ్యర్థాల తొలగింపు తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ సమీక్షలో అదనపు ఎస్పీలు మునిరామయ్య, విమలకుమారి, కులశేఖర్, డిఎస్పీలు వేణుగోపాల్, కాటంరాజు, విజయ్ శేఖర్, విజిఓలు మనోహర్, బాలిరెడ్డి, సిఐలు జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రశేఖర్, ఎవిఎస్వోలు సురేంద్ర, సాయిగిరిధర్, మనోహర్, శివయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు.
.