నగరి రూరల్ వికెఆర్ పురం పంచాయితీ లోని మీరాసాహెబ్ పాలెం గ్రామాన్ని దత్తత తీసుకొన్న ఎమ్మెల్యే ఆర్.కె.రోజా, ఆ గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా గ్రామంలోని అన్ని వీధులకు సిమెంట్ కాంక్రీటు రోడ్డులను వేయడానికి భూమిపూజ చేశారు.
గ్రామంలోని లోపల, బయట వచ్చి వెళ్ళే దారులతో కలిపి ఈ వీధుల మొత్తం పొడవు మొత్తం 620 మీటర్లు (10 అడుగుల వెడల్పు రోడ్).
ఈ రోడ్లను రోజా తన సొంత నిధులతో నడుపబడుతున్న రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్మించనున్నారు. ఈ రోడ్డు నిర్మాణపు అంచనా విలువ దాదాపు 23.00 లక్షల రూపాయలు. (అక్షరాలా ఇరవై మూడు లక్షల రూపాయలు).
ఈ కాంక్రీటు రోడ్డు నిర్మాణపు పనులకు రోజు నేడు భూమిపూజ చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్థులు మాట్లాడుతూ, తమ గ్రామానికి ఒక పెద్ద దిక్కులా వుండి, గ్రామ బాగోగులను చూస్తున్న ఎమ్మేల్యే ఆర్కే రోజాకు తాము జీవితాంతం ఋణపడి ఉంటామని గ్రామస్థులు తమ కృతజ్ఞతలను తెలియజేశారు.
Discussion about this post