చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఈ నెల 24 నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు నిర్వహించునున్న మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఆహ్వాన పత్రికలు ఇంకా ముద్రించ లేదని ఆలయ కార్య నిర్వహణాధికారి పెద్దిరాజు తెలిపారు.
ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికలు ముద్రించినట్లు సామాజిక మాద్యమాల్లో వస్తున్న వార్తలు అబద్దమన్నారు. ఎవరో ప్రైవేటు వ్యక్తులు వీటిని ముద్రించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారన్నారు.
వాటితో ఆలయానికి సంబంధం లేదన్నారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించి దేవదాయశాఖ ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉందని… ఉత్తర్వులు వచ్చిన తరువాతనే ఆహ్వాన పత్రికలు ముద్రిస్తామని చెప్పారు.
భక్తులు ఇది గమనించాలని కోరారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఆహ్వాన పత్రికలు గురించి నమ్మవద్దని భక్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
Discussion about this post