తిరుపతి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష ఆధ్వర్యంలో కాళికాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీకాళహస్తి సమీపంలోని వేడాం గ్రామం లో వెలసిన దక్షిణ కాళిక మాత అమ్మవారి ఆలయంలో ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు .
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆయన సతీమణి బొజ్జల బృందమ్మ లు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.
వీరు త్వరగా కోలుకోవాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.
అనంతరం ఆలయ ఆవరణలో కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగు మహిళలు పాల్గొన్నారు.
.

Discussion about this post