భూలోక నందనవనమైన తిరుమల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా శ్రమదానం చేస్తున్నామని, ఈ మహత్తర కార్యక్రమంలో స్థానికులందరూ భాగస్వాములు కావాలని టీటీడీ ఈవో ఎవి. ధర్మారెడ్డి అన్నారు.
తిరుమలలోని బాలాజీ నగర్‌లో టీటీడీ ఆరోగ్య మరియు ఎస్టేట్స్ విభాగాల ఆధ్వర్యంలో మంగళవారం శ్రమదానం కార్యక్రమం జరిగింది.
ప్రతి పదిహేను రోజులకోసారి టీటీడీ సీనియర్ అధికారులతో కలిసి నిర్వహిస్తున్న శ్రమదానం కార్యక్రమంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఈవో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, స్థానికులు, భద్రతా సిబ్బంది, శానిటరీ సిబ్బందితో కూడిన దాదాపు 200 మంది ఉత్సాహంగా పాల్గొని కాలనీల్లోని చెత్తాచెదారం తొలగించారు.
ఎస్‌ఈ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, ఎస్టేట్స్ విభాగం ప్రత్యేకాధికారి మల్లికార్జున, విజివో బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
.

Discussion about this post