శ్రీకాళహస్తిలో ప్రసిద్ధి చెందిన ఏడు గంగల జాతర డిసెంబరు 7, 8 తేదీల్లో జరగనుంది. ఈ మేరకు జాతరకు సంబంధించిన కార్యక్రమాల వివరాలను శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థాన అర్చకులు బండారు పరమేశ్వరయ్య వెల్లడించారు.
శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి అనుబంధ దేవాలయమైన ఏడుగంగమ్మల ఆలయంలో నందు ఎంతో వైభవోపేతంగా జాతర ను నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తిలోని ఏడు ప్రధాన కూడళ్లలో ఏడు గంగమ్మలను నిలబెట్టి ఉత్సవాలు నిర్వహిస్తారు.
ఏడుగంగల జాతర కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.
5-12-2021 ఆదివారం రాత్రి చాటింపు
7-12-2021 మంగళవారం సాయంత్రం 5గంటలకు శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం తరపున 7గంగమ్మలకు సారె బహుకరణ తదుపరి ఏడుగంగమ్మల అమ్మవారికి రాత్రి 12 గంటలకు అభిషేకం, కుంభం వేయబడును.
8-12-2021ఉదయం నిర్ణీత ప్రదేశాలలో గంగమ్మల నిలుపు,
8-12-2021రాత్రి 8 గంటల నుండి ఊరేగింపుగా వెళ్లి 12 గంటలకు గంగమ్మల నిమజ్జనం కోవిడ్-19 నిబంధనలతో జాతర జరుగును.జాతర గత సంవత్సరం జరిగినట్లే పసుపు ముద్దలతో గంగమ్మ ఊరేగింపు జరుగుతుంది.
Discussion about this post