మినిస్టరీ ఆఫ్ హెూమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సెక్రటరీ అనురాధప్రసాద్
శ్రీకాళహస్తి రూరల్ – ప్రభ న్యూస్ : హస్తకళల కేంద్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, మినిస్టరీ ఆఫ్ హెూమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సెక్రటరీ అనురాధప్రసాద్ అన్నారు.
డి.ఆర్.డి.ఏ. ప్రాజెక్ట్ డైరెక్టర్ డి.యం.కె.తులసితో కలసి మినిస్టరీ ఆఫ్ హెూమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సెక్రటరీ శ్రీకాళహస్తి పరిసరాలలో దక్షిణ భారత దేశంలోనే అతి పెద్దదిగా నిర్మిస్తున్న హస్తకళల కేంద్రాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హస్తకళల కేంద్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, ఇక్కడ పార్క్ తో పాటు ఫుడ్ కోర్టు కూడా ఏర్పాటు చేసి టూరిజం వారితో అనుసంధానం చేస్తూ శ్రీకాళహస్తి – తిరుమల మార్గములో అత్యున్నత ప్రదేశంగా తీర్చిదిద్దాలని తెలియ చేశారు.
పిడి డి.ఆర్.డి.ఏ. మాట్లాడుతూ ఈ హస్తకళల కేంద్రంలో కళాకారులు వారు వస్తువులను తయారు చేసుకోవడానికి, అమ్ముకోవడానికి, నివాసము వుండటానికి అన్ని ఏర్పాట్లు కల్పించేలా నిర్మాణం చేస్తున్నామని తెలియ చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి క్లస్టర్ ఏరియా కో-ఆర్డినేటర్ డాక్టర్ పి.డాంగే యాదవ్, ఏపియం-సి.మునెయ్య, డ్వామా ఏపిడి సుబ్రమణ్యం, సిసి లు బి.శ్రీనివాసులు, పి.గెరటారెడ్డి, బి.లక్ష్మయ్యలు పాల్గొన్నారు.
.

Discussion about this post