న్యాయ వారోత్సవాల్లో భాగంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ అక్టోబర్ 2 నుంచి నవంబర్ 14 వరకు ప్రారంభించిన పాన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణంలోని కోర్ట్ ఆవరణలో న్యాయ విజ్ఞాన సదస్సు లో భాగముగా వివిధ శాఖల స్టాల్స్ ను శ్రీకాళహస్తి న్యాయమూర్తులు సందర్శిచారు.
ఈ కార్యక్రమములో శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి అరుణ , లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మెంబెర్ రాజేశ్వర రావు, న్యాయవాది రమేష్ మరియు బార్ కౌన్సిల్ మెంబెర్ లు, మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ మెంబెర్లు, పారా లీగల్ వాలంటరీ, మరియు అన్ని శాఖల ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
అనంతరం మహిళా సాధికారత దినోత్సవం సందర్భముగా సి డి ఫై ఓ శాఖ సమావేశం జరిగినది.
సీనియర్ సివిల్ జడ్జి అరుణ మాట్లాడుతూ… మహిళా సాధికారత అవసరం ఉందన్నారు. మొత్తం జనాభాలో 50% మహిళలు ఉండాలి. అయినప్పటికీ, ఆడ భ్రూణహత్య పద్ధతుల కారణంగా, భారతదేశంలో ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. మహిళలపై అత్యాచారం, యాసిడ్ దాడి, వరకట్న వ్యవస్థ, గౌరవ హత్య, గృహ హింస మొదలైన ఘోరమైన నేరాలు ఇప్పటికీ భారతదేశంలో జరుగుతున్నాయి అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యక్తిగత స్థాయిలో, మహిళలను గౌరవించడం ప్రారంభించాలి మరియు వారికి పురుషులతో సమానమైన అవకాశాలను ఇవ్వడం ప్రారంభించాలి. ఉద్యోగాలు, ఉన్నత విద్య, వ్యాపార కార్యకలాపాలు మొదలైన వాటిని చేపట్టడానికి మహిళలను ప్రోత్సహించాలి అని అరుణ పిలుపు ఇచ్చారు.
మీకు ఎలాంటి సమస్య వచ్చినా కోర్ట్ ఆవరణలో అర్జీ రూపంలో తెలియజేసినట్లయితే పరిష్కరించే ప్రయత్నం చేస్తామని అన్నారు.
.

Discussion about this post