వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి.. నిప్పులు చెరగుతున్నారు. రెండేళ్ల నుంచి ఈ ఆగ్రహాన్ని అణిచిపెట్టుకున్నానంటూ అవినీతి అనకొండ గురించి.. తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.
ఒక సీనియర్ ఐఏఎస్, మహిళా అధికారిని భూమన కరుణాకర రెడ్డి.. తాటకిగా పూతనగా లంకిణిగా అభివర్ణించారు. ఆమె కట్టే చీరలు ఒక్కొక్కటి లక్షన్నర రూపాయల విలువ చేస్తాయంటూ.. ఆమె యొక్క అవినీతి డోసేజీని ఘాటుగా చెప్పడానికి ప్రయత్నించారు. ఆమె వాడుతున్న విగ్గు ఒక్కొక్కటి యాభైలక్షల రూపాయలని, అలాంటలి విగ్గులు ఆమె వద్ద 11 ఉన్నాయని కూడా ఆయన హేళన చేశారు. ఇంచుమించుగా బాడీషేమింగ్ వంటి విమర్శలు చేశారు.
ఇంతా కలిపి భూమన కరుణాకరరెడ్డి ఇలా నిప్పులు చెరగినది సీనియర్ ఐఎఎస్, అవినీతి ఆరోపణలతో అత్యంత వివాదాస్పదరురాలైన వై. శ్రీలక్ష్మి గురించేనని, ఆయన పేరు ప్రస్తావించకపోయినప్పటికీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ అర్థమైంది.
వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న రోజుల నుంచి వై. శ్రీలక్ష్మి జగన్మోహన్ రెడ్డి సూచనలకు అనుగుణంగా పనిచేసినట్టు అనేక ఆరోపణలు వచ్చాయి. గాలి జనార్దనరెడ్డి మైనింగ్ కేసుల్లో శ్రీలక్ష్మి కూడా నిందితురాలు. అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు మూటగట్టుకున్నారు. జైలుకు కూడా వెళ్లివచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత.. ఆమె తెలంగాణ కు కేటాయింపబడ్డారు.
అయిదేళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏపీలో సీఎం అయిన వెంటనే.. శ్రీలక్ష్మి ఆయనను ఆశ్రయించారు. ఆయన కేంద్రానికి ప్రత్యేకంగా లేఖ రాసి.. శ్రీలక్ష్మిని ఏపీ సర్వీసులోకి తీసుకున్నారు. మునిసిపల్ శాఖ కార్యదర్శిగా కీలక బాధ్యతలు అప్పగించారు.
ఇప్పుడు ఆమెను విమర్శించడం ద్వారా భూమన కరుణాకర రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నట్టుగా మారుతోంది.
Discussion about this post