అమెరికాలోని తెలుగు సంస్థల్లో ఒకటైన తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా వారు 2022 సంవత్సరానికి గాను కథలు కవితల పోటీలు నిర్వహించారు. ఇందులో కవితల పోటీా ఫలితాలను తాజాగా వెల్లడించారు. కథల పోటీ ఫలితాలు మరి కొద్ది రోజుల్లో వెల్లడిస్తామని సమాచారం ఇచ్చారు.
తెల్సా వారి ఫలితాల ప్రకటన:
తెల్సా కవితల పోటీ – 2022 లో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు. పోటీకి దాదాపు 150 కవితలు వచ్చాయి. మాకు వచ్చిన కవితలన్నిటినీ శ్రద్ధగా పరిశీలించాము. పోటీకి వచ్చిన కవితల్లో మేము ప్రకటించిన బహుమతులు అందుకొనే కవితలు దొరకలేదు. అందువల్ల విశిష్టమైనవిగా గుర్తింపు పొందిన నాలుగు కవితలకు ₹10,000 చొప్పున, మరొక మూడు కవితలకు ₹8,000 చొప్పున పారితోషికంగా ఇద్దామని నిర్ణయించాము. కొన్నిరోజులలో పారితోషికం బాంకు ద్వారా పంపుతాము.
₹10,000 పారితోషికం పొందిన కవితల పేర్లు
(అకారాది క్రమంలో), వాటి రచయితల పేర్లు
1. ఆగిపోయిన చోటునుండే — బండ్ల మాధవరావు
2. ఒకానొక సార్థక సవారీ — దొండపాటి నాగజ్యోతిశేఖర్
3. నువ్వే ఒక పాలపుంత — డాక్టర్ సుంకర గోపాలయ్య
4. షష్ఠముడు — కె. ఎ. ముని సురేష్ పిళ్ళై
₹8,000 పారితోషికం పొందిన కవితల పేర్లు
(అకారాది క్రమంలో), వాటి రచయితల పేర్లు
1. ఏదో ఒకటి మాట్లాడు — చొక్కర తాతారావు
2. నా లోకి నదిని ప్రవహించనీయండి — దాట్ల దేవదానం రాజు
3. మరణానికి మరో చూపు — ‘దేశరాజు’
పోటీకి వచ్చిన కథల పరిశీలన ఇంకా పూర్తి కాలేదు. అయిన వెంటనే తెలియజేస్తాము.
బహుమతి పొందిన కవితలూ, కథలూ ఒకేసారి మా వెబ్ సైట్‌లో, మా వెబ్ పత్రిక “సంగతి”లో ప్రచురిస్తాము.
పోటీలో గుర్తింపు పొందిన కవులను అభినందిస్తూ, పోటీకి తమ కవితలు పంపిన అందరికీ మరోసారి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
— తెల్సా బృందం
https://www.telsaworld.org
.

Discussion about this post