• About Us
  • Contact Us
  • Our Team
Wednesday, August 12, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

దీపావళి సంబరాలకు ముందు… ఆలోచించండి! 

aparajitha by aparajitha
November 9, 2020
0
దీపావళి సంబరాలకు ముందు… ఆలోచించండి! 

సాధారణంగా దీపావళి పండుగ వస్తోంది అంటే అందరికీ సంబరమే… అందునా పిల్లలకైతే చెప్పనక్కర్లేదు. వారి సంబరమే సంబరం… టపాకాయలు కాల్చడం, కొత్త బట్టలు, పిండివంటలు… ఇలా అన్నీ వారికి ఇష్టమైనవే… అందుకే పిల్లలకు, పెద్దలకు కూడా దీపావళి పండుగ అంటే చాలా ఇష్టం. అయితే ఈసారి దీపావళి పండుగను చాలా జాగ్రత్తగా జరుపుకోమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కరోనా విలయం జరుగుతున్న నేపధ్యంలో అసలు దీపావళి పండుగ సంబరాలను కాస్త తగ్గించుకుంటే మంచిదని మేధావులు చెబుతున్నారు. 

కరోనా వైరస్ గాలిలో చాలా దూరం వరకు ప్రయాణం చేస్తుందని ఇప్పటికే శాస్త్రవేత్తలు చెప్పారు. అందరూ కూడా మాస్క్ ధరించడం తప్పనిసరి, అలాగే సామాజిక దూరం పాటించడం కూడా తప్పనిసరి అని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ నేపధ్యంలో అసలు కరోనా వైరస్ కలుషితమైన గాలి ద్వారా మరింత వేగంగా వ్యాపిస్తుందని తాజాగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 

దీపావళికి టపాకాయలు కాల్చడం వల్ల గాలిలో ఉన్న చెడు వైరస్ పోతుందని పూర్వకాలంలో నమ్మేవారు. దానికి అనుగుణంగా టపాకాయలను కూడా తయారుచేసేవారు. కానీ కాలక్రమేణా పరిస్థితుల్లో, టపాకాయల తయారీలో మార్పులు చోటుచేసుకున్నాయి. రంగురంగుల పువ్వులను వెదజల్లే టపాకాయలు తయారు చేస్తున్నారు. ఇలా తయారు చేయడానికి పలురకాలైన విషపూరిత రసాయనాలను అందులో కలుపుతున్నారు. ఫలితంగా టపాకాయలు కాల్చేవారికి ఆనందాన్ని ఇవ్వడమేకాదు… మరోవైపు మనకు తెలియకుండానే మన చుట్టూ ఉన్న గాలిని కలుషితం చేస్తున్నాయి. అందుకే టపాకాయలను పూర్తిగా కాల్చవద్దని చెబితే వినరు కాబట్టి తక్కువగా కాల్చమని మొన్నటివరకూ నిపుణులు చెబుతూ వచ్చారు. తాజాగా టపాకాయలు కాల్చిన కలుషితమైన గాలిలో కరోనా మరింత వేగంగా వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 

ఇప్పటికే ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో బాణ సంచా అమ్మకాలను నిషేధించారు. బాణసంచా పొగమాటున కరోనా వైరస్ దాడిచేసే ప్రమాదం ఉందని, ముఖ్యంగా శ్వాసకోస సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఏటా టపాకాయల కాలుష్యం వల్ల పలు శ్వాస సంబంధ సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిస్తూనే ఉన్నా టపాకాయల కొనుగోళ్లు తగ్గడం లేదు. ఇకనైనా అందరం కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకుని టపాకాయలను కాల్చడం పూర్తిగా మానేస్తే మంచిది. అలాగే శ్వాస సంబంధ సమస్యలు ఉన్నవారు. ఈ బాణసంచా పొగకు ఎంద దూరంగా ఉంటే అంత మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

కరోనా వైరస్ కాలుష్యం ద్వారా వేగంగా వ్యాప్తి చెందుతుందని, ముఖ్యంగా బాణసంచా కాల్చేటప్పుడు వెలువడే కాలుష్యం ద్వారా దీని వ్యాప్తి మరింతగా ఉంటుందని, గాలిలోని చిన్న చిన్న ధూళికణాలకు కరోనా వైరస్ అంటుకుని, మన శ్వాసకోశాల్లోకి చేరి మనకు ప్రాణాంతకంగా పరిణమిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 

Tags: be alert diwalicorana precautionscovid atmospherediwali celebrationsno crackers in delhi
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

12.7.26 ‘కథానిధి’ సమీక్ష: సమకాలీన జీవిత వైరుధ్యాలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply