శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం పెద్ద కన్నలి రెవెన్యూ లో తుఫాన్ కారణంగా పడిన భారీ వర్షాలకు దాదాపు 30 ఎకరాలు వరి పొలం నీట మునిగి పోయింది, వరి నాటి కనీసం 10 రోజులు కాలేదు, ఈలోగా మునిగిపోవడంతో రైతులు గొల్లుమంటున్నారు.
భారీ వర్షాలతో పాటు పక్కన ఉన్న పెద్ద కన్నలి చెరువుకు వెళ్లే కోన కాలువ ఉప్పొంగుతుంది. పంట పొలాల్లో నుంచి నీరు బయటకు వెళ్లకపోగా కాలువలు పొలాల్లోకి ప్రవహిస్తున్నాయి.
గతంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది, ఇప్పుడు మళ్లీ అదే విధంగా మునిగిపోవడం రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇందులో బసవయ్య పాలెం గ్రామానికి చెందిన రైతులు R. ముని కృష్ణయ్య, S. రవిచంద్ర,S.మణి మరికొందరు రైతులు తీవ్రంగా నష్టపోయారు,
అధికారులు, నాయకులు ఇప్పటికైనా స్పందించి కోన కాలువ బాగుచేయలని మరియు నష్టపోయిన వారికి పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు
Discussion about this post