సీరియస్ టైటిల్‌తో నవ్వుల ప్రామిస్!

214

భీష్మ అనే పేరు వినగానే.. మన మైండ్ సెట్ ఒక రకమైన వ్యక్తిత్వానికి ట్యూన్ అవుతుంది. చాలా సీరియస్ గా ఉండే వ్యక్తి, ధర్మం గురించి నిష్టగా ఉండే, నియమబద్ధంగా బతుకుతూ ఉండే బ్రహ్మచారి.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేవాడు.. తన మరణాన్ని సైతం తానే శాసించుకోలిగిన వాడు.. అపారమైన కౌరవ సామ్రాజ్యానికి పెద్దదిక్కు, సేనలందరికీ తొలినాయకత్వం వహిచంగల అపారమైన ప్రజ్ఞాసంత్తులు గల వారుడు మనకు జ్ఞప్తికి వస్తారు.

కానీ తమాషా ఏంటంటే.. భీష్మ అనే అత్యంత సీరియస్ టైటిల్‌తో వస్తున్నప్పటికీ.. హీరో నితిన్ మాత్రం ఈ సినిమా  మొత్తం ఫుల్ కామెడీ పండిస్తానని అంటున్నాడు. నితిన్ ఇదివరలో ఫుల్ లెంగ్ కామెడీ ఎప్పుడూ ట్రై చేయలేదు. తన మాటల్లో మాత్రం ఇది అలాంటి జోనర్ చిత్రమే అంటున్నాడు. హీరోయిన రష్మిక మందన్నా కూడా కేవలం నవ్వుల గురించి మాత్రమే చెబుతోంది.

భీష్మ అనేది కామెడీ జోనర్ సినిమా అని ప్రమోట్ చేసుకుంటే.. క్లిక్ అవుతుందని సినిమా టీమ్ ఫిక్సయినట్లుగా ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ ఆ పాయింట్ ను హైలైట్ చేస్తున్నారు. కామెడీకి సంబంధించి ఇంత హైప్ క్రియేట్ చేసిన తర్వాత.. కామెడీ పాళ్లు ఏ కొంత తగ్గినా.. ప్రేక్షకులను నిరాశ పరచినట్లు అవుతుందని వాళ్లు తెలుసుకోవాలి.

Facebook Comments