పన్ను వసూళ్ల పేరుతో ప్రజలను వేధించడం మానుకోవాలని భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు కాసరం రమేష్ హితవు పలికారు.
పన్నుల పేరుతో పురపాలక సంఘం అధికారులు వేధింపులను వ్యతిరేకిస్తూ శ్రీకాళహస్తిలో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాసరం రమేష్ మాట్లాడుతూ.. ఇంటి పన్ను వసూళ్ల పేరుతో పురపాలక శాఖ అధికారులు ప్రజల పరువు తీస్తున్నారని ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలను “జలగ”లాగా పీల్చుతోందన్నారు. కరోనా మహమ్మారితో ప్రజల బతుకు ప్రశ్నార్థకంగా మారినా… ప్రభుత్వం కరుణించక పోవడం బాధాకరమన్నారు.
పన్ను కట్టక పోతే ఇళ్లకు తాళాలు వేస్తూ వైసీపీ ప్రభుత్వం తన నిరంకుశ విధానం చాటుతోందన్నారు.పురపాలకశాఖ అధికారుల తీరు చాలా బాధాకరంగా ఉందన్నారు.
శ్రీకాళహస్తి పురపాలక పరిధిలో సుమారు 19,619 మంది పై చిలుకు ఇంటి పన్ను చెల్లింపుదారులు ఉన్నారన్నారు. వీరిలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారన్నారు. అయితే పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఇళ్ల వద్దకు వెళ్లి మైక్ అనౌన్స్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన వాపోయారు.
అయినవారికి ఆకుల్లో.. కాని వారికి కంచంలో”,అన్న చందంగా పురపాలకశాఖ అధికారుల తీరు ఉందని ఆయన విమర్శించారు. ఇకనైనా బలవంతపు వసూళ్లకు స్వస్తి చెప్పాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి వజ్రం కిషోర్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ చిలకా రంగయ్య, ఈశ్వరయ్య, రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ కో-కన్వీనర్ సోట్టా సుకుమార్, ఇమ్మడిశెట్టి మోహన్, పట్టణ ఉపాధ్యక్షులు వాసు యాదవ్, ఎల్.గోపాల్, ఢిల్లీబాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు కొండేటి గోపాల్, తిరుపతి పార్లమెంటరీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు ప్రజ్ఞశ్రీ, ఓబీసీ పట్టణ అధ్యక్షులు కన్నా వెంకటేశ్వర్లు, పద్మజా వాణి, శివమ్మ, బాల గురవయ్యయాదవ్, మణి, యువ మోర్చా పట్టణ అధ్యక్షులు హరీష్, పట్టణ ప్రధాన కార్యదర్శి భరత్ నాయుడు, పట్టణ ఎస్సీసెల్ అధ్యక్షులు యతీష్, ఈశ్వర్, పట్టణ మైనారిటీ అధ్యక్షులు ఖాదర్,గోపాల్,బాల, డేవిడ్, రవి, ఢిల్లీ, కుమార్ ,అజిత్, రాము,నాని, నరేష్ ,చిన్న,కార్తీక్, సాయి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
.