భాజపా అనే వ్యవస్థకు పార్టీ అనే అస్తిత్వాన్ని లుప్తం చేసేసి, భాజపా అంటేనే నరేంద్ర మోడీ, అమిత్ షా అన్నట్లుగా పునర్నిర్వచించడంలో ప్రస్తుత నాయకత్వం సఫలం అయింది. ఏ ఘనకార్యం జరిగినా దాని కీర్తిని పూర్తిగా మోడీకి కట్టబెడుతూ.. యావద్దేశంలోని పార్టీ తో భజనలు చేయించే బాధ్యతను అమిత్ షా భుజాన మోస్తుంటారు. అందుకే మంచి చెడులన్నింటికీ ఈ ఇద్దరే బాధ్యత వహించాలి.
ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే.. అయిదు రాష్ట్రాల్లో జరగబోతున్న ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి అగ్ని పరీక్ష అని చెప్పాలి. ఛత్తీస్ గఢ్ ను పక్కన పెడితే.. మధ్యప్రదేశ్, రాజస్తాన్ లలో భాజపా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. మిజోరంలో వారి ఉనికి లేదు. తెలంగాణలో ఉనికిని కూడా కోల్పోయే పరిస్థితి ఉంది.
అయితే అయిదు రాష్ట్రాల మీద సమానంగా దృష్టి పెట్టగల తీరిక ప్రధానికి ఉందని అనుకోలేం. కాస్త కష్టపడితే.. గట్టెక్కగలం అనిపించే రాష్ట్రాల్లో మాత్రం ఆయన ముమ్మరంగా ప్రచారంచేసి, మిగిలిన చోట్ల మొక్కుబడి ప్రచారంతో ముగించవచ్చు. తెలంగాణలో మోడీ రెండు బహిరంగసభల్లో పాల్గొనాలని స్థానిక నాయకులు ప్రణాళిక రచిస్తున్నారు. ఇక్క ఎన్నిసీట్లు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి ఉంది. అలాంటప్పుడు.. మోడీ ఎంత దృష్టిపెడతారో.. అమిత్ షా.. ఎంత కాన్సంట్రేట్ చేస్తారో అనుమానమే.
.

Discussion about this post