తిరుమల శ్రీవారికి మంగళవారం ఉదయం హీరో మోటో కార్ప్ సంస్థ నూతన మోడల్ ప్యాషన్ ప్లస్ ద్విచక్ర వాహనాన్ని విరాళంగా అందించింది. ఈ వాహనం ధర రూ.92,921/- అని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ముందుగా అలయం వద్ద ఈ వాహనానికి పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హీరో సంస్థ సౌత్ జోన్ మేనేజర్లు శ్రీ రామురావు, శ్రీ లక్ష్మీ షా కలిస వాహనం పత్రాలను ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ లోకనాధంకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ పేష్కార్ శ్రీ శ్రీహరి, పోటు పేష్కార్ శ్రీ శ్రీనివాసులు, డిస్ట్రిబ్యూటర్ శ్రీ పృథ్వీ, తిరుమల డిఐ శ్రీ జానకిరామిరెడ్డి పాల్గొన్నారు.
.

Discussion about this post