వెంకీ కుడుములకు హ్యాండిచ్చిన నితిన్

268

వారిద్దరి కాంబినేషన్లో రూపొందిన భీష్మ చిత్రం ఇవాళే విడుదల అవుతోంది. ఇద్దరూ విడివిడిగా ఈ సినిమా మీద చాలా గొప్ప అంచనాలే ఉన్నట్లుగా చెబుతున్నారు. నితిన్ కు పెళ్లి కానుకలాగా.. ఈ భీష్మ సినిమా విజయం ఉంటుందని కూడా అనుకుంటున్నారు. అయితే ఇలాంటి సందర్భంలో… దర్శకుడు వెంకీ కుడుముల మాత్రం.. తనకు హీరో నితిన్ హ్యాండిచ్చాడని అంటున్నాడు.

నితిన్ ఎందుకిలా చేశాడు? ఏం హ్యాండిచ్చాడు…? తెలుసుకోవాలంటే..  వెంకీ కుడుముల వెళ్లగక్కిన గోడేంటో తెలుసుకోవాల్సిందే. వెంకీ కుడుముల చెప్పిన ప్రకారం…

సహజంగా బ్యాచిలర్స్ అంటేనే ఒక కరువులో ఉంటారుట.  ఆ కరువులో ఉండే వారి కష్టాలను సరదాగా చెప్పడం కోసమే.. భీష్మ అనే టైటిల్ ను ఎంచుకున్నాడట. దిల్ సినిమా తెగ నచ్చి.. అప్పటినుంచి నితిన్ కూడా బాగా అభిమానించడం ప్రారంభించిన వెంకీ కుడుముల.. నితిన్ తో సినిమా చేసే అవకాశం రాగానే.. తన హీరోను కొత్తగా ఎలాచూపించాలి అనే కసరత్తు ఎక్కువగా చేశాడుట. ఇప్పటికే  నితిన్ చాలా రకాల సినిమాలు చేశాడు గనుక.. బ్యాచిలర్ గా చూపిస్తూ.. బ్యాచిలర్ల కష్టాలు తెలియజెబుతూ సినిమా ప్లాన్ చేశాడట. అలా మొత్తానికి ఈ బ్రహ్మచారుల సినిమాకు మరికొంత బ్రహ్మచారుల్ని పోగేసుకున్నారు. సాగర్ వచ్చి కలిశాడు. కేవలం బ్యాచిలర్ల కష్టాల గురించి సింగిలే అనే పాట రాయడానికి.. సింగిల్ గా ఉన్న శ్రీమణిని పిలిపించాడట.

ఇంతకూ వెంకీ కుడుముల ఆవేదన ఏంటంటే.. సినిమా మొదలయ్యే నాటికి అందరూ సింగిల్ గానే ఉన్నాం. మొత్తంగా కలిపి బ్రహ్మచారుల సినిమాగా దీనిని స్టార్ట్ చేశాం. కానీ సినిమా పూర్తయ్యే సమయానికి హీరో నితిన్ మాకు హ్యాండిచ్చాడు.. ఆయన పెళ్లి చేసేసుకుంటున్నాడు. అని!

హీరో నితిన్ కు పెళ్లి ఫిక్సయిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ లో వారి పెళ్లి దుబాయ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరుగుతుంది. రిసెప్షన్ మాత్రం హైదరాబాదులో ఇస్తారు. సో, కేవలం తన పెళ్లి తాను చేసుకుంటున్నందుకు…. హీరో నితిన్.. ఈ భీష్ముల టీమ్ కు హ్యాండిచ్చినట్టుగా వాళ్లు బాధపడుతున్నారన్నమాట.

Facebook Comments