విశాలాంధ్ర ఎడిటర్ ముత్యాల ప్రసాద్ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా కరోనా వ్యాధితో విజయవాడలో చికిత్స పొందుతూ ఉన్నారు. కరోనా తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో మృతి చెందారు. అభ్యుదయ భావాలు కలిగిన ముత్యాల ప్రసాద్ విశాలాంధ్రలో సబ్ ఎడిటర్ గా ప్రస్థానం మొదలుపెట్టి అంచలంచలుగా ఎడిటర్ స్థాయికి ఎదిగారు.
గత ఏడేళ్లుగా విశాలాంధ్ర ఎడిటర్ గా కొనసాగుతున్నారు. అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన అకాల మృతికి జర్నలిస్టు సంఘాలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి
.