గురుడు ఒక సంవత్సరానికి ఒక రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పడు ఆ రాశికి సంబందించిన నదికి పుష్కరాలు వస్తాయని పెద్దలు చెబుతారు. అయితే ఇలా పుష్కరాలు వచ్చే పన్నెండు నదులు ఏవి…?
బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినపుడు గంగానదికి పుష్కరాలు వస్తాయి. అలాగే వృషభరాశిలో ప్రవేశించినపుడు నర్మదానదికి, మిథున రాశిలో ప్రవేశించినపుడు సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయి. అయితే ఈ సరస్వతీ నది అనేది ఇప్పుడు కనిపించదు. ఇది అంతర్భాగ నదిగా చెబుతారు. కర్కాటక రాశిలో యమునానదికి, సింహరాశిలో ప్రవేశించినపుడు గోదావరి నదికి, కన్యారాశిలో ప్రవేశించినపుడు కృష్ణానదికి, తులారాశిలో ప్రవేశించినపుడు కావేరీ నదికి, వృశ్చిక రాశిలో ప్రవేశించినపుడు భీమా నదికి, ధనూరాశిలో ప్రవేశించినపుడు రాజస్తాన్ లో ఉన్న పుష్కరవాహిని నదికి, మకర రాశిలో తుంగభద్రానదికి, కుంభరాశిలో తుంగభద్రానదికి, మీన రాశిలో ప్రవేశించినపుడు ప్రాణహిత నదికి పుష్కరాలు వస్తాయి. ఇలా ఈ పన్నెండు నదులకు పన్నెండేళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తున్నాయి.
Discussion about this post