అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్రతిరోజు పండగే లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాల నిర్మాత బన్నీ వాసు, దర్శకుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ప్రకటించిన రోజు నుంచి కూడా ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ టీం విడుదల చేసిన అఖిల్ అక్కినేని ఫస్ట్ లుక్‌కు, అలానే గోపీ సుందర్ సంగీత సారధ్యంలో హ్యాపెనింగ్ స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన మనసా మనసా పాటకు, ఆ తర్వాత విడుదల చేసిన టీజర్‌కు అటు సోషల్ మీడియాలో ఇటు అభిమానుల్లో అనూహ్యమైన స్పందన లభించడం యూనిట్‌లో కొత్త ఉత్సాహన్ని తెచ్చింది.
ఇదే ఉత్సాహంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలోని ఏ జిందగీ పాట ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్నేతారు. జూన్ 19న చిత్రం విడుదల కానుంది. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తన చిత్రాల్లోని పాత్రల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో లవ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అఖిల్ అక్కినేని, పూజాల మధ్య కూడా అలాంటి కెమిస్ట్రి ఉండేలా డిజైన్ చేసారు.
.

Discussion about this post