ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో గురువారం రాజ్యాంగ దినోత్సవం. దేశం మొత్తం ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఏపీలో అధికార పార్టీ వైసీపీ కూడా రాజ్యాంగ దినోత్సవాలను నిర్వహించింది. అయితే ఈ సందర్భంగా తెలుగుదేశం సీనియర్ నాయకుడు మాజీ మంత్రి, మాజీ స్పీకరు కూడా అయిన యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. రాజ్యాంగ దినోత్సవం వైసిపి చేయడం ‘‘దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని ఎద్దేవా చేశారు.
అంబేద్కర్ రాజ్యాంగ దినోత్సవం చేసే హక్కు వైసిపిjr లేదన్నారు. వైసిపి చేయాల్సింది రాజారెడ్డి రాజ్యాంగ దినోత్సవం అని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు చూస్తే అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుందన్నారు. రాజ్యాంగ సంస్థలను అవమానిస్తే రాజ్యాంగాన్ని అవమానించడమేనని, ఏపీలో ముఖ్యమంత్రి జగన్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించి.. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు అన్నారు.
అంబేద్కర్ పట్ల అగౌరవంగా వ్యవహరించారని, తెలుగుదేశం ప్రభుత్వం తలపెట్టిన అంబేద్కర్ స్మృతి వనం పనులు ఆపేశారని యనమల పేర్కొన్నారు. రాష్ట్రంలోర పలు ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహాలు మాయమైతే చర్యలు లేవని నిరసించారు. బిసి,ఎస్సీ,ఎస్టీ, ముస్లింలపై అడుగడుగునా దాడులు, దౌర్జన్యాలు చేయడమే అంబేద్కర్ రాజ్యమా..? అని యనమల ప్రశ్నించారు. ఏపిలో దళితులపై జరిగే దమనకాండ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా జరుగుతోందా..? అని అడిగారు.
దళిత యువకులకు శిరోముండనాలు, దళిత ఆడబిడ్డలపై గ్యాంగ్ రేప్ లు, హత్యలు…67ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఇంత కిరాతక కాండ చూశామా ..? అని యనమల రామకృష్ణుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపించారు.
.
Discussion about this post