యోగ అభ్యసనంతో ఉన్నతమైన వ్యక్తిత్వం గల వారిగా మారవచ్చునని తిరుపతి రామకృష్ణ మిషన్ కార్యదర్శి
సుకృతానంద చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బుధవారం ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో విద్యార్థులకు యోగాసనాల ప్రదర్శన, యోగా దినోత్సవం పై కళాశాల ప్రాంగణంలో రంగోలి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుకృతానంద మాట్లాడుతూ, నిత్య జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొనే వైద్యులు యోగ సాధన ద్వారా ఒత్తిడిని జయించి సమాజానికి మెరుగైన సేవ అందించే వైద్యులుగా మారవచ్చునన్నారు.
కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన టీటీడీ చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శేష శైలేంద్ర మాట్లాడుతూ, ప్రతి పనిని యోగంగా భావించి అంకితభావంతో పనిచేయడం కూడా యోగానేనని చెప్పారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ, ఆయుర్వేద ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రేణు దీక్షిత్, కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుందరం, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ చంద్ర కిషోర్, ప్రొఫెసర్ జ్ఞాన ప్రసూన, డాక్టర్ సిహెచ్ సత్యనారాయణ, డాక్టర్ వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.
Discussion about this post