కోలీవుడ్ లో అక్టోబర్ 4న విడుదలైన ’96’ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. విజయ్ సేతుపతి, త్రిష ల కెమిస్ట్రీకి తమిళ తంబీలు ఫిదా అయిపోయారు. క్రిటిక్స్ నుండి కూడా అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ పొందుతూ ముందుకు దూసుకెళ్తోంది సినిమా. ఇక ఈ సినిమా రీమేక్ రైట్స్ ను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు విడుదలకు ముందే కొనుగోలు చేశారు. తమిళ్ లో తన నటనతో మైమరపించిన త్రిషనే తెలుగులో కూడా నటించమని దిల్ రాజు ఆడిగినట్టు సమాచారం.
త్రిష దీనికి ఓకే చెప్పిందట కానీ ఇందులో హీరో ఎవరో ముందే చెప్పమని కోరిందట. అయితే, నానికి సినిమా విపరీతంగా నచ్చింది కానీ ఇంకా గ్రీన్ సిగ్నల్ మాత్రం ఇవ్వలేదు. పైగా ‘జెర్సీ’ సినిమా షూటింగ్ కోసం క్రికెట్ ప్రాక్టీస్ లో ఉన్న నాని వేరే సినిమాల పైకి దృష్టి మరల్చకూడదు అనుకున్నాడు. పైగా ’96’ లో హీరోది మధ్య వయసు పాత్ర. వయసు రిత్యా ఇలాంటి పాత్రలో నాని చేయడం బాగోదని కొందరు అభిప్రాయాన్ని చెప్తున్నారు. ఇక సాయి ధరమ్ తేజ్, శర్వానంద్, ఇలా ఎవరైనా ఆ పాత్రకు సెట్ కాకపోవచ్చు. అయితే ముందు ‘హలో గురు ప్రేమ కోసమే’ నిర్మాణాంతర పనులలో బిజీగా ఉన్న దిల్ రాజు సినిమా విడుదల అయ్యాకే ’96’ లో హీరో గురించి ఒక నిర్ణయం తీసుకొనున్నారని టాక్.
.
Discussion about this post