హీరో శర్వానంద్, ఫిదా బ్యూటీ సాయి పల్లవి మొట్టమొదటిసారిగా ‘పడి పడి లేచే మనసు’ అనే సినిమాలో నటించనున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇప్పటికే సినిమా నుండి కొన్ని పోస్టర్లను విడుదల చేసి ప్రేక్షకులలో సినిమాపై అంచనాలను పెంచారు. ఇక ఇప్పుడు ప్రమోషన్స్ లో భాగంగా ఒక టీజర్ ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు దర్శకనిర్మాతలు.
ఈనెల 10వ తారీఖు ఉదయం 9:30 నిమిషాలకు ‘పడి పడి లేచే మనసు’ టీజర్ విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఒక అందమైన పోస్టర్ కూడా విడుదల చేసింది. హీరోయిన్ సాయి పల్లవి శర్వానంద్ పరిగెడుతూ హొలీ ఆడుతూ కనిపిస్తారు. ఇక వీరిద్దరి ఫ్రెష్ కెమిస్ట్రీ సినిమాకు బాగానే వర్కౌట్ అవుతుందని చిత్ర బృందం ఆశిస్తుంది. చాలా వరకు షూటింగ్ కోల్కతా, నేపాల్, హైదరాబాద్లో జరిగింది. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 21వ తారీఖున విడుదల కానుంది. ఇక ఈ సినిమా శర్వా, పల్లవి ల విన్నింగ్ స్ట్రీక్ ను కంటిన్యూ చేస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
.

Discussion about this post