దేశంలో కరోనా మళ్లీ జడలు విప్పుతుంది. కేవలం నాలుగు వారాల్లోనే నాలుగు రెట్లు పెరగడం అనేది ప్రమాదకర సంకేతంగా కనిపిస్తుంది. రాబోయే రెండు నెలల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు అంచనా వేస్తున్నారు.
మహారాష్ట్రంలో కొవిడ్ కేసులు బీభత్సంగా నమోదు అవుతున్నాయి. గత ఏడాది కొవిడ్ విజృంభిస్తున్న తరుణంలో, లాక్ డౌన్ విధించినప్పుడు ఏరీతిగా.. ఎంత పెద్ద స్థాయిలో కేసులు నమోదు అవుతూ వచ్చాయో.. ఇప్పుడు కూడా అదే స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో లాక్ డౌన్ లేదు. ఈ పరిణామం.. మరింత దెబ్బతీస్తుందా.. మరింత కొవిడ్ విజృంభణకు దారితీస్తుందా అనే భయాలు కూడా కలుగుతున్నాయి.
ఒకవైపు వేక్సినేషన్ చాలా ముమ్మరంగా జరుగుతోంది. ఏప్రిల్ 1 నుంచి దేశంలో 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వేక్సిన్ వేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేసింది. 60 ఏళ్లు దాటిన అందరికీ కొవిడ్ వేక్సినేషన్ ప్రక్రియ చాలా వరకు సఫలవంతంగానే జరిగింది. అయితే.. ప్రభుత్వం ఎంత గట్టిగా ప్రచారం చేస్తున్నప్పటికీ.. ప్రజల నుంచి స్పందన మాత్రం తక్కువగానే ఉంటోంది. వేక్సినేషన్ పట్ల రకరకాల భయాలు, అపోహలు పెంచుకుంటూ.. వేయించుకోడానికి అర్హత ఉన్న వయస్సు వారు కూడా చాలా మంది దూరంగా ఉంటున్నారు.
అలా కాకుండా.. కొవిడ్ వ్యాప్తిని సరిగ్గా నియంత్రించాలంటే నిర్ణీత కాలంలోగా ప్రతి ఒక్కరూ కూడా వేక్సినేషన్ చేయించుకోవడం అత్యవసరం అని గుర్తించాలి.
.


Discussion about this post