భారీ వర్షాలు తిరుమలను కూడా అతలాకుతలం చేస్తున్నాయి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీవర్షాల బీభత్సం కనిపిస్తుండగా.. తిరుమలకు కూడా ఆ తాకిడి బాగానే ఉంది.
కొండచరియలు విరిగిపడుతుండడంతో తిరుమల మొదటి ఘాట్ రోడ్డును ముందుగానే మూసివేశారు. అయితే గురువారం రాత్రి పూర్తిగా రెండు ఘాట్ రోడ్డులను మూసివేయాలని నిర్ణయించారు. సాధారణంగా రాత్రి 11 గంటల వరకు రెండో ఘాట్ రోడ్డులో వాహనాలు అనుమతిస్తుంటారు.
ఈ రోజు ప్రత్యేకించి.. 8 గంటలకే మూసివేయాలని నిర్ణయించారు.
తిరుమల, తిరుపతిలలో అధిక వర్షం కారణంగా రెండు ఘాట్ రోడ్ లను గురువారం అనగా 11-11-2021న రాత్రి 8 గంటల నుండి శుక్రవారం ఉదయం 12-11-2021 ఉదయం 6 గంటల వరకూ తాత్కాలికంగా మూసి వేస్తారు. భక్తులు గమనించాలని టీటీడీ తెలియజేసింది.
తిరుమల, తిరుపతి యావత్తూ వర్షబీభత్సంలో చిక్కుకుంది. కపిలతీర్థం జలపాతం పెద్దఎత్తున ఉప్పొంగుతోంది. చూపరులకు కనువిందు చేస్తోంది. తిరుపతిలో జనజీవితం స్తంభిస్తోంది. రోడ్లు మడుగులుగా మారుతున్నాయి.
.
Discussion about this post