వారం రోజులుగా విడవకుండా కురుస్తున్న వర్షం తిరుపతి వాసులను ఇబ్బందులకు గురిచేస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ ముంపునకు గురై స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో.. ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. తిరుమల కొండల మీదినుంచి వస్తున్న వరద ప్రవాహం తిరుపతిలో పలు ప్రాంతాల్లో జనజీవితాన్ని స్తంభింపజేస్తున్న నేపథ్యంలో కాలువలు, ఇతర నీటి ప్రవాహ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో పరిశీలించారు.
వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి ఎమ్మెల్యే ప్రజలతో మాట్లాడి కష్టనష్టాలు తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
.