టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి సోమవారం తిరుమల నుండి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్ రోడ్డులోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
అక్కగార్ల గుడి వద్ద కొండ మీద నుంచి రోడ్డుపైకి జాలువారుతున్న వర్షపునీటి వల్ల కొండ చరియలు విరిగి పడే ప్రమాదం ఉందా అని పరిశీలించారు.
ఆ ప్రాంతంలో నడిచి వస్తున్న పలువురు భక్తులతో ముచ్చటించారు. నడక మార్గంలోని వసతులు, ఆన్‌లైన్‌లో దర్శన టికెట్ల లభ్యత తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. వసతులు బాగున్నాయని, దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నామని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం మాలాడి గుండం సమీపంలో కొండ చరియ మీద వర్షపు నీటి ప్రవాహం వల్ల వేర్లు బయటపడి కూలే స్థితిలో ఉన్న చెట్టును పరిశీలించి దాన్ని వెంటనే తొలగించి, కొండ చరియలు రోడ్డు మీద పడకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అలిపిరి వద్ద సప్తగోప్రదక్షిణశాలను పరిశీలించి ఫెన్సింగ్, ఆర్చిల పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇక్కడ గోపూజ, గోప్రదక్షిణ చేసుకోవచ్చనే విషయం భక్తులకు తెలిసేలా ఇరువైపులా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఛైర్మన్ వెంట ttd చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు ఇతర అధికారులు ఉన్నారు.
.

Discussion about this post