‘‘వేషము మార్చెను.. భాషను మార్చెను.. అయినా మనిషి మారలేదు’’ అంటూ ఓ సినీ కవి మానవ నైజాన్ని ఎఫ్పుడో చెప్పారు. విప్లవ కవి గద్దర్ విషయానికి వస్తే.. ఒంట్లో పోలీసు తూటాను దాచుకుని బతుకుతున్న ఈ విప్లవ కవి.. వేషము ఎన్నడో మార్చారు. తన విప్లవ గీతాలతో తెలంగాణ ప్రజల చైతన్యాన్ని ఉరకలెత్తించిన గద్దర్.. భాషను కూడా మార్చారు. తాజాగా మనిషి కూడా మారారు.
విప్లవ భావజాలాల స్థానే భక్తి బాట పట్టారా..? అనిపించేలా.. యాదగిరి గుట్ట నరసింహస్వామిని దర్శించుకున్నారు. ప్రజలు మంచిగా బతకాలంటే.. పోరాటమే శరణ్యమని నమ్మిన ఈ యోధుడు.. ప్రజలు మంచిగా బతికేలా చూడమని ఇవాళ దేవుడిని వేడుకోవడమే విశేషం.
ప్రముఖ విప్లవ గాయకుడు గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్ రావు.. యాదగిరి గుట్ట నరసింహస్వామిని దర్శించుకున్నారు. స్వామి ఎదుట సాగిలపడి సాష్టాంగ ప్రణామాలు ఆచరించారు. లెఫ్ట్, హేతువాద భావజాలానికి నిలువెత్తు ప్రతీక అయిన ఈ దళిత, ఉద్యమ కవి గద్దర్.. ఆలయానికి వెళ్లి దేవుడిని సేవించుకోవడమే పెద్ద విశేషం అయితే.. యాదగిరి గుట్ట నరసింహస్వామిని ఉద్దేశించి పాట కట్టి పాడడం.. నర్సన ఓ నర్సన యాదగిరీ నర్సన అంటూ కీర్తించడం.. ఇంకా పెద్ద విశేషం.
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టను దర్శించుకున్న విప్లవ కవి గద్దర్ తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని స్వామిని కోరుకున్నారు. కుటుంబసమేతంగా ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. ‘మా బీదోళ్లను సల్లంగా చూడునో మాయన్న మా నర్సన్న.. యాది మరచిపోకు అన్నో మా నరసన్న’ అంటూ గద్దర్ పాటకట్టి పాడారు.
వీడియో చూడండి :
.
Discussion about this post