పండుగ వేళ ప్రయాణికులపై ‘ప్రత్యేకం’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భారం మోపడానికి సిద్ధమైంది. అంతా ఇంతా కాదు మామూలు ఛార్జీ కంటే సగం ధర అదనంగా పెంచుతోంది. కరోనా వేళ ప్రజలు పండుగ చేసుకోవడమే భారంగా మారిన వేళ.. ఎందుకింత భారం మోపుతున్నారో ఏలికలకే తెలియాలి.
సినిమా టికెట్ల ధరలు తగ్గించే జగన్.. ఆర్టీసీ ఛార్జీలు పెంచడం విడ్డూరంగా ఉంది. అదే తెలంగాణ ప్రభుత్వం విషయానికి వస్తే పండుగ వేళ కూడా మామూలు ఛార్జీలతోనే నడపాలని నిర్ణయించింది. ఈ విషయంలో కేసీఆర్ని చూసి జగన్ నేర్చుకోవాల్సిందేనని ప్రయాణికులు అనుకుంటున్నారు.
సంక్రాంతి పండుగ సమీపిస్తోంది. పట్టణాల్లో నివాసం ఉండే వారు పల్లెలకు పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీ, తెలంగాణ ఆర్టీసీలు రెగ్యులర్ సర్వీసులతో పాటు.. ప్రత్యేక సర్వీసులు నడపడానికి సిద్ధమయ్యాయి.
read also : పరువు పాయె.. వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి సెల్ఫ్ గోల్
ధరల విషయంలో రెండు సంస్థల మధ్య పోటీ నెలకొంది. ఏపీఎస్ ఆర్టీసీ సంక్రాంతికి సగం ఛార్జీని అదనంగా పెంచింది. తెలంగాణ ఆర్టీసీ మాత్రం రెగ్యులర్ ఛార్జీలతోనే నడుపుతామని ప్రకటించింది. ఈ ప్రభావం ఏపీఎస్ ఆర్టీసీపై పడే ప్రమాదముంది. ఈ నెల 7నుంచి 13వ తేదీ వరకు సొంతూళ్లకు వచ్చే వారి కోసం ఏపీఎస్ ఆర్టీసీ మొత్తం 4,145 ప్రత్యేక బస్సలు నడపడానికి ప్రణాళిక సిద్దం చేసింది. ఇందులో హైదరాబాదు నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నడిపే బస్సులు సుమారు 1,500 ఉన్నాయి.
16వ తేదీ నుంచి తిరుగు పయనం అయ్యేవారి కోసం 2,825 బస్సులు నడపనున్నారు. ఇందులో వివిధ జిల్లాల నుంచి హైదరాబాదుకు వెళ్లేవి సుమారు 1,000 బస్సులు ఉన్నాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ 4,300 ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తెస్తోంది. వీటిలో కొన్నింటిని హైదరాబాదు నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు నడపనుంది. తమ ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు లేవంటూ తెలంగాణ ఆర్టీసీ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఈ కారణంగా ఏపీఎస్ ఆర్టీసీకి అనధికార పోటీ ఏర్పడింది.
read also : తెలంగాణలో అక్క పార్టీ దిక్కు లేనిదేనా?
తెలంగాణ ఆర్టీసీకి గిట్టుబాటు అయ్యేటపుడు.. ఏపీఎస్ ఆర్టీసీకి ఎందుకు గిట్టుబాటు కాదనేదే ఇక్కడ ప్రజల మదిలో మెదలుతున్న ప్రశ్న. ప్రజలపై భారం మోప కూడదని పాలకులు అనుకుంటే ఇది సాధ్యమవుతుంది. సినిమా టికెట్ల ధరలు పెంచాలని ఆ పరిశ్రమ వారు నెత్తీ నోరు మొత్తుకుంటున్నా.. ప్రజలపై భారం తగ్గించడానికి ధర తగ్గించామని చెబుతున్న జగన్.. పండుగ వేళ ప్రజలపై ‘అదనపు భారం’ ఎందుకు మోపుతున్నారో ఆయనకే తెలియాలి.
read also : పెద్దిరెడ్డి కుటుంబానికే కొరుకుడు పడలేదే.. ఎవరీ మద్దిరెడ్డి కొండ్రెడ్డి?
అదీ అంతా ఇంతా కాదు.. 50శాతం ఛార్జీలు పెంచుతున్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచడంతో ప్రైవేటు బస్సుల వారు కూడా భారీగా ఛార్జీలు పెంచేశారు. ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయం ప్రయాణిలకు పెనుభారంగా మారనుంది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణాలో కేసీఆర్ ప్రత్యేక బస్సులకు అదనపు ఛార్జీలు పెంచకుండా మంచి నిర్ణయం తీసుకున్నారు.
read also : జగనన్న కలవదలచుకుంటే మధ్యలో వాళ్లెవరు?
ఆయన నిర్ణయం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాదు నుంచి ఏపీలోని సొంత ఊర్లకు పండగకోసం తరలి వచ్చే వారు కూడా.. కేసీఆర్ కు ఈ సమయంలో జై కొట్టే పరిస్థితి! ఛార్జీలు పెంచడం వలన జగన్ విమర్శల పాలవుతున్నారు. ‘గాలి వీచినపుడే తూర్పూర పట్టాలి’ అనే నానుడిని జగన్ అనుసరిస్తున్నారనే విమర్శ వస్తోంది. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు తగ్గిస్తే బాగుంటుదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. జగన్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
.
Discussion about this post