‘‘రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌తో చర్చలు జరగకుండా ఆర్థిశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అడ్టుకుంటున్నారు’’ అని ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు బొప్పరాజు వెంకటేశ్వర్లు అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం. జగన్ ఓ మోనార్క్ అనే ప్రచారం ఉంది. ఆయన చేయదలచుకుంటే ఎవరు వద్దన్నప్పటికీ వినరు. ఇది అందరికీ తెలిసిన సత్యం.
అలాంటి స్వభావం ఉన్న జగన్ ను కలవకుండా ‘ఆ ముగ్గురూ అడ్డుకుంటున్నారు’ అని బొప్పరాజు చెప్పడాన్ని ఎవరూ నమ్మే స్థితిలో లేరు. ఆ విషయం తెలియకుండానే.. ఉద్యోగ సంఘాల నేత ఈ కామెంట్ చేశారా? లేదా, అలాంటి వెన్నపూసిన మాటలతోనైనా ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోగలం అని నమ్ముతున్నారా తెలియదు!
ఉద్యోగ సంఘాల నేతలతో నేరుగా చర్చలు జరపడానికి జగన్ సుముఖంగా లేరనేది వాస్తవం. ‘కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం’ అన్న విధంగా మధ్యలో సంఘాలతో చర్చలు సాగిస్తున్న ‘ఆ ముగ్గురూ’ నలిగి పోతున్నారనేది పరిశీలకు మాట.
read also : పరువు పాయె.. వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి సెల్ఫ్ గోల్
రాష్ట్ర ఉద్యోగులు మరోసారి ఉద్యమబాట పట్టడానికి సమాయత్తం అవుతున్నారు. ఇందుకోసం ఈ నెల 9న ఏపీ ఐకాస, ఐకాస అమరావతి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఆ రోజే తమ ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించారు. విజయవాడలోని ఎన్జీవో హోమ్ లో సోమవారం జరిగిన ఐకాసల ఐక్యవేదిక సమావేశంలో ఈ తీర్మానం చేశారు. ఇందుకు కారణం పీఆర్సీతో పాటు ఉద్యోగుల అన్ని డిమాండ్లపై ప్రభుత్వం సరిగా స్పందించక పోవడమే.
పీఆర్సీతో పాటు ఉద్యోగుల 71 సమస్యలపై చర్చించడానికి ఇరవై రోజుల కిందటే ఆర్థిక మంత్రి బుగ్గన, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సీఎస్ శర్మ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్ఢి ఉద్యోగ సంఘాల నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ఆ రోజు చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి.
read also : తెలంగాణలో అక్క పార్టీ దిక్కు లేనిదేనా?
ఈ నేపథ్యంలో ఐకాస నేలతో ముఖ్యమంత్రి జగన్ మరుదినమే స్వయంగా చర్చలు జరుపుతారని సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ప్రకటించారు. ఈ విషయం పత్రికల్లో కూడా వచ్చింది. అయితే ఇరవై రోజులు గడచి పోయినా జగన్ మాత్రం చర్చలకు ఐకాస నేతలను ఆహ్వానించలేదు. ఇందుకు కారణం ‘ఆ ముగ్గురు’ అని బొప్పరాజుతో సహా ఐకాస నేతలు అంటున్నారు.
వాస్తవాలు మాట్లాడుకుంటే.. ఉద్యోగ సంఘాల నేతలతో జగన్ స్వయంగా చర్చలు జరపాలని అనుకుంటే ఆపే శక్తి ఈ ముగ్గురికీ లేదు. జగన్ ఉద్దేశ్య పూర్వకంగానే అలా చేస్తున్నారని, కలవడంలేదని స్పష్టమవుతోంది. పీఆర్సీ పాటు ఇతర సమస్యలపై ఐకాస నేతలతో చర్చించాలని జగన్ కు ‘ఆ ముగ్గురు’ విజ్ఞప్తి చేయగా ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయం వారు బయటకు చెప్పలేక కాలయాపన చేస్తున్నారు.
read also : పెద్దిరెడ్డి కుటుంబానికే కొరుకుడు పడలేదే.. ఎవరీ మద్దిరెడ్డి కొండ్రెడ్డి?
ఉద్యోగ సంఘాల నేతలతో మొదటి రోజు జరిగిన చర్చల్లో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. అయితే ఆ తరువాత జరిగిన చాలా చర్చలకు ఆయన దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
మంత్రులు, ఎమ్మెల్యేలకే జగన్ తో భేటీ చాలా అరుదుగా దొరికే అవకాశం అనే ప్రచారం ఒకటి ఉంది. పాలన వ్యవహారాల్లో ఇతరుల సలహాలు, సూచనలకంటె జగన్ తన సొంత నిర్ణయాలకే ప్రాధాన్యం ఇస్తారని కూడా అంటుంటారు. ఇలాంటి జగన్- ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలపై ఐకాస నేతలతో నేరుగా చర్చించడానికి ఇష్టపడడంలేదు. ప్రభుత్వ విధానం ఏమిటో ఇప్పటికే చర్చల్లో తమ ప్రతినిధుల ద్వారా చెప్పేశారు. అంతకంటె ఒక మెట్టు తగ్గడానికి జగన్ కు ఇష్టం లేదు గనుక.. అసలు నేరుగా కలవడానికే ఇష్టపడడం లేదా? అనే ప్రచారం ఉంది. అదే భావన ఆయనకు లేక పోతే ఐకాస నేతలతో చర్చలు ఎపుడో జరిగేవి.
ప్రభుత్వ తీరుపై అసంతృప్తి గా ఉన్న ఐకాస నేతలు మళ్లీ ఉద్యమ కార్యాచరణకు ముహూర్తం ఖరారు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ తీరులో మార్పు వస్తుందేమో వేచి చూడాలి. అదే జరిగితే ఉద్యోగులు విజయం సాధించినట్లే. వారి సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కారం కావాలని ఆశిద్దాం.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
.

Discussion about this post