చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఈ నెల 24వ తేదీ నుంచి నిర్వహించనున్న మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాలని కోరుతూ బుధవారం పలువురు ప్రముఖులను ఆహ్వానించారు.
ముక్కంటి ఆలయం తరపున ముద్రించిన బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికలను వారికి అందజేశారు. రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లె శ్రీనివాసరావుకు, దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్ కు, కమిషనరు హరి జవహర్ లాల్, అడిషనల్ కమిషనరు చంద్రకుమార్ కు, రీజనల్ జాయింట్ కమిషనరు కేవీ సాగర్ బాబుకు, అసిస్టెంటు కమిషనరు శోభారాణికి, జాయింట్ సెక్రటరీ సూర్య నారాయణకు ఈ ఆహ్వాన పత్రికలు అందించారు.
ఈ కార్యక్రమంలో ముక్కంటి ఆలయ ఈవో పెద్దిరాజు. ఏఈవో మోహన్, రాజా వైదీశ్వరన్, అర్దగిరి స్వామి తదితరులు పాల్గొన్నారు.
.