వైసీపీ ప్రభుత్వం మూడేళ్లల్లో కరెంటు చార్జీలను భారీగా పెంచింది. కేటగిరీలను రద్దుచేసి, 6 స్లాబ్ లను తీసుకొచ్చి ఏపీలో సామాన్యులపై సర్కార్ మరో పిడుగు వేసింది.
30 యూనిట్ల వారికి యూనిట్‌కు 45 పైసలు పెంచారు. 31 నుంచి 75 యూనిట్ల వారికి యూనిట్‌కు 91 పైసలు పెంచారు. 76 నుంచి 125 యూనిట్ల వారికి యూనిట్‌కు రూ.1.40 పెంచారు.
అలాగే 126 నుంచి 225 యూనిట్ల వారికి యూనిట్‌కు రూ.1.57 పెంచగా, 226 నుంచి 400 యూనిట్ల వారికి యూనిట్‌కు రూ.1.16 పెంచారు. 400 యూనిట్లపైన వారికి యూనిట్‌కు 55 పైసలు పెంచడం ఏ రేంజ్ బాదుడో ఈ సర్కార్ ప్రజలకు చెప్పాలి. సామాన్యుని నుండి సంపన్నుల వరకు అన్ని వర్గాల పై పెంచిన కరెంటు బిల్లుల భారం పడనుంది.
ఇప్పటికే ఈ ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తుంది. చెత్త పన్ను, ఆస్తిపన్ను, కుళాయి పై పన్నులు వేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇప్పుడు కొత్తగా పెంచిన విద్యుత్ చార్జీలు మరింత భారం కానుంది.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధరలు పెరిగినప్పుడు బాదుడే… బాదుడు… బాదుడే… బాదుడు… అంటూ నానా యాగీ చేసిన జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం బాటలోనే అనేక రకాలుగా పన్నుల భారం మోపింది.
గతంలో ట్రూఆఫ్ చార్జీలు పెంచినప్పుడు జనసేన పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది. దాంతో వైసీపీ ప్రభుత్వం దిగొచ్చి ట్రూ ఆఫ్ చార్జీల పెంపును విరమించుకుంది.
పెంచిన కరెంటు చార్జీలను వెంటనే తగ్గించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని ఎడల జనసేన పార్టీ ప్రజా పక్షాన ఎంతటి పోరాటానికైనా సిద్ధం అని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ తెలియజేసారు..
.