సరుకుల కొనుగోళ్లలో పారదర్శకత అవసరమని ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు అన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయ ప్రాంగణంలో సరుకుల నిల్వ చేసే గదిని బుధవారం ఆయన పరిశీలించారు.
సరుకుల నిల్వ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ.. ముక్కంటి ఆలయానికి సంబంధించి సరుకుల కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరగకూడదన్నారు.
ఒకవేళ ఎవరైనా అక్రమాలకు పాల్పడితే శాఖాపరంగా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. శ్రీకాళహస్తి శాసన సభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు స్వామి అమ్మవార్ల గర్భగుడి నందుగల దీపాలకు కర్ణాటక ప్రభుత్వంచే తయారు చేయబడిన నందిని ఆవు నెయ్యి మాత్రమే ఉపయోగించాలని ఆదేశించారు.
దేవస్థానంలో నిత్యవసరాలు అన్నీ నాణ్యమైనవిగా ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మంలడలి సభ్యులు బుల్లెట్ జయశ్యామ్, సాధన మున్నా రాయల్, స్టోర్ ఇన్చార్జులు పాల్గొన్నారు.
.