కెనడాకు చెందిన ప్రఖ్యాత బ్రాంప్టన్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ నుంచి ఇటీవల గౌరవ డాక్టరేట్ పొందిన భారతీయ జనతా పార్టీ తిరుపతి పార్లమెంటు జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా కిసాన్ మోర్చా ఇంఛార్జి, ఎల్ఐసీ మాజీ డెవలప్మెంట్ ఆఫీసర్ డాక్టర్ చంద్రప్పను శుక్రవారం శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన ఎల్ఐసీ ఏజెంట్లు ఘనంగా సన్మానం చేశారు.
30 ఏళ్లుగా చంద్రప్ప చేస్తున్న సేవలకు డాక్టరేట్ ప్రదానం చేయడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ కార్యక్రమంలో హరిబాబు, గోపి, మునిరాజా, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనపై చూపిన అభిమానానికి డాక్టర్ చంద్రప్ప ఏజెంట్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.
.