టీవీఎస్ సంస్థ తరఫున ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ చెన్నైకి చెందిన సెల్వం శనివారం ఏసి సౌకర్యంతో కూడిన రెండు కూరగాయల లారీలను టిటిడికి విరాళంగా అందించారు. ఈ వాహనాల విలువ రూ.80 లక్షలని దాత తెలిపారు.
ముందుగా శ్రీవారి ఆలయం ఎదుట కొత్త వాహనాలకు పూజలు నిర్వహించిన అనంతరం దాత టిటిడి ఈవో ఎవి. ధర్మారెడ్డికి తాళం చెవులను అందజేశారు.
ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ అన్నప్రసాద కార్యకలాపాలకు కూరగాయలను తీసుకెళ్లేందుకు ఎసితో ఈ వాహనాలను ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపారు. దాతలకు శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డిఐ జానకిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
.