ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. పురపాలక సంఘం పరిధిలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.
వైద్యశాఖ లెక్కల ప్రకారం బుధవారం నాటికి 140 క్రియాశీలక కేసులు ఉండగా.. గురువారం మళ్లీ 43 కొత్త కేసులు నమోదయ్యాయి.
వీటిలో కలిపితే శ్రీకాళహస్తి పట్టణంలో క్రియాశీలక కేసుల సంఖ్య 183కు చేరింది. తాజాగా శ్రీకాళహస్తి గ్రామీణ పరిధిలో 6, తొట్టంబేడులో 11, ఏర్పేడులో 3, రేణిగుంటలో 16 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
శ్రీకాళహస్తి పురపాలక సంఘం పరిధిలో తాజాగా నమోదైన కేసుల వివరాలు పరిశీలిస్తే…బహదూర్ పేటలో 3, బాలాజీనగర్ లో 4, భాస్కరపేటలో 1, పెద్దమసీదువీధిలో 6, సినిమావీధిలో 5, దోబీఘాట్ ప్రాంతంలో 2, కొండమిట్టలో 2, పోలీస్ క్వార్టర్స్ లో 1, పీవీరోడ్డులో 5, సాలిపేటలో 4, శ్రీరామనర్ కాలనీలో 9, వీఎం పల్లెలో 1, తెలుగుగంగ కాలనీలో 1 వంతున కేసులు నమోదయయ్యాయి.
ఇక శ్రీకాళహస్తి గ్రామీణ పరిధిలో ఊరందూరులో 2, వేలవేడులో 1, బి.వెంకటాపురంలో 1, ఎంపేడులో 1, సుబ్బానాయుడుకండ్రిగలో 1 వంతున కేసులు నమోదయ్యాయి.
కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో జనం ఆందోళనకు గురవుతున్నారు.
.