‘కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టినట్టు’ అంటూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శించడం అంటే అదేమీ చిన్న విషయం కాదు. తాజాగా ఇలాంటి తీవ్రమైన విమర్శను హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేశారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల గురించి మాట్లాడుతూ.. బాలకృష్ణ ఒక్కసారిగా ఆగ్రహంతో రెచ్చిపోయారు.
హిందూపురం నియోజకవర్గం లేపాక్షిలో పర్యటించిన బాలకృష్ణ హిందూ ఆలయాల గురించి మాట్లాడారు. ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస దాడులు అన్నింటినీ ప్రస్తావించారు. రాముల వారి తల వేరుచేసినా.. దిక్కులేకుండాపోయిందని వాపోయారు.
రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడితప్పిందని, కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టినట్టుగా తయారైందని బాలయ్య అన్నారు. బాలయ్య వీరావేశం పట్ల తెలుగుదేశం నాయకుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా.. వైసీపీ నాయకులు గుర్రుమంటున్నారు.
ఇదీ చదవండి
బెంగుళూరు పారిపోయిన భూమా అఖిలప్రియ భర్త
.

Discussion about this post