శాస్త్రీయ సంగీతం అంటే భారత దేశంలో చాలా గౌరవం ఉంది. భారత దేశంలో మాత్రమే కాదు. వేరు వేరు దేశాల వారు కూడా కేవలం శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం కోసమే మన దేశానికి వస్తున్నారు. దీని గురించి మన దేశంలో చాలా కథలు, పురాణాలు ఉంటాయి. దేవతల నుంచే మన శాస్త్రీయ సంగీతం పుట్టింది అని మనం నమ్ముతుంటాము. మన దేశంలో దీని కోసం ప్రత్యేక ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఊరూరా చాలా సంగీత ప్రదర్శనలు మనం చూస్తూ ఉంటాము. ఇలాంటి దివ్యమైన రంగంలో, ఎం.ఎస్ సుబ్బలక్ష్మి, యేసుదాస్, ప్రియా సిస్టర్స్ లాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ వీళ్లందరికన్నా ముఖ్యమైన వ్యక్తులు పాత కాలంలో శాస్త్రీయ సంగీతాన్ని ఆస్వాదించి, గౌరవించి, పాడిన వాళ్లు కూడా అనేకులు. వాళ్లలోనే ఒక గొప్ప వ్యక్తి, బెంగళూరు నాగరత్నమ్మ. ఆమె గురించిన ప్రత్యేకంగా పాఠకులకు ఆదర్శిని డాట్ కామ్ అందిస్తున్న సంగీత కథనం…
బెంగళూరు నాగరత్నమ్మ 1878లో పుట్టు లక్ష్మి-వకీల్ సుబ్బా రావు దంపతులకు జన్మించింది. పుట్టు లక్ష్మి వాళ్ల పూర్వీకులు మైసూర్ సంస్థాన గాయకులు. సుబ్బారావు వదిలేసిన మూలాన పుట్టు లక్ష్మి కూతురితో మైసూర్ మహారాజా సంస్థానంలో ఉండడం మొదలుపెట్టింది. అక్కడి సంగీతకోవిదుడు అయిన శాస్త్రి, నాగరత్నమ్మ కు సంగీతం నేర్పించాడు. నాగరత్నమ్మకు అయిదేళ్ల వయసు వచ్చినప్పుడు, దేవదాసిగా ఆమె జీవితం ప్రారంభం అయింది. కానీ కొద్ది రోజులకు శాస్త్రి కూడా పుట్టు లక్ష్మి ని వదిలేయగా, తను ఆమె మామ వెంకటస్వామి అప్ప దగ్గరకు వెళ్లిపోయింది. ఆయన వృత్తి రీత్యా వయోలిన్ వాయించేవారు. నాగరత్నమ్మ తన చదువులను కొనసాగిస్తూ, కన్నడ, ఇంగ్లీష్, తెలుగు భాషలు నేర్చుకుంది. ఇవి నేర్చుకుంటూనే నాట్యం, సంగీతం కూడా బాగా నేర్చుకుంది. మునుస్వామప్ప ఆమెకు శాసత్రీయ సంగీతం నేర్పించారు. 15వ ఏటకి నాగరత్నమ్మ తన తెరంగేట్రం చేయగలిగింది.
ఇదీ చదవండి : మిస్ ఇండియా సినిమా రివ్యూ కలర్ ఫోటో సినిమా రివ్యూ : జ్ఞాపకాల్లో దాగిపోయే చిత్రం పవన్ గొప్ప మానవతామూర్తి ఎందుకంటే?
నాగరత్నమ్మ చిన్నవయసులో ఉన్నప్పుడే బోలెడంత అభిమానుల్ని సంపాదించుకుంది. కన్నడ, సంస్కృతం, తెలుగులో ఆమె పాటలు పాడేది. హరికథలు కూడా చెప్పేది. అప్పటిలో మైసూర్ రాజు జయచమరాజేంద్ర వొడయార్ ఆమె నాట్య కళలను చూసి ఆకర్షితుడై ఆమెకు ఆస్థాన విదుషీమణి స్థానం ఇచ్చాడు. రాజు చనిపోయాక ఆమె బెంగళూరుకు వచ్చేసింది. బెంగళూరుకు వచ్చాక, ఆమె ట్రవన్‌కోర్, బొబ్బిలి, విజయనగరం వంటి అనేక ఇతర రాజ గృహాలచే పోషించబడింది. మైసూర్ న్యాయస్థానం లో న్యాయమూర్తి అయిన నరహరి రావు ఆమెను మద్రాసుకు వెళ్లమని చెప్పాడు. దానితో ‘శాస్త్రీయ సంగీతానికి మక్కా’ అయిన మద్రాసుకు ఆమె వెళ్లింది. త్యాగరాజ ఆరాధన యొక్క మద్దతుదారుగా, ఆమె మద్రాసులో పన్ను కట్టిన మొదటి మహిళా కళాకారిణి అయింది.
ఆమెకు త్యాగరాజు అంటే చాలా గౌరవం ఉండేది. ఎంత గౌరవం ఉండేదంటే, ఆయన పేరు మీద ఒక ఆశ్రమం కూడా కట్టించింది.
ఆమె చివరి రోజులు బాగా గడవలేదు. ఆమె పిల్లలిద్దరూ చనిపోయారు. దత్తత తీసుకున్న బాబు కూడా చనిపోయాడు. కానీ అందరూ అంటూంటారు, దేవుడు తనకి అత్యంత ప్రేమ ఉన్న వాళ్లకే అత్యంత కష్టమైన పరిస్థితులు ఇస్తుంటాడని.
తర్వాత, నాగరత్నమ్మకు రాముడి దగ్గర తప్పితే వేరే ఏ చోట ప్రశాంతత దక్కదు అని అనుకుని, తనకున్నదంతా ఆయనకి సమర్పించాలని అనుకుంది. దీని తర్వాత ఒక సారి ఆమెకి కలలో త్యాగరాజ సమాధి కనిపించింది. తర్వాత రోజే తిరువయ్యూర్‌కు వెళ్లి అక్కడ త్యాగరాజ సమాధిని కనిపెట్టి, అక్కడ ఒక సీతారామ గుడి కట్టించింది. గుడి కట్టించడం కోసం ఆమెకు ఉన్న సమస్తం ఆమె వదులుకుంది.
1952లో 74 ఏళ్ల వయసు ఉన్నప్పుడు బెంగళూరు నాగరత్నమ్మ చనిపోయింది. ఆమె గౌరవార్థం ఒక స్మారక చిహ్నం త్యాగరాజ సమాధి పక్కన నిర్మించబడింది.
‘భక్తి లేని సంగీతానికి ఉపయోగం ఏంటి?’
~త్యాగరాజ
శాస్త్రీయ సంగీతాన్ని మనందరం గౌరవిస్తాం. ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటాం. ఆ రంగంలో మనం ఇప్పుడు వస్తున్న చాలా మందిని మనం చూస్తూ ఉన్నాము. కానీ పాత కాలంలో, సాంప్రదాయాలను మాత్రమే నమ్మిన సమాజంలో, అప్పటి నిబంధనలను ఎదిరించి సంగీతం నేర్చుకున్నవాళ్లను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు.
.. ఆదర్శిని శ్రీ
.

Discussion about this post